200 కోట్ల మోసం.. హీరోయిన్ అరెస్ట్!

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం అంటారు. తెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు జీవితం ధన్యం అవుతుందని భావించేవారు ఎంతో మంది ఉంటారు. కానీ ఆ ఛాన్సు కొద్దిమందికే వస్తుంది.. దాంతో సొసైటీలో మంచి గౌరవం, హోదా లభిస్తుంది. అయితే కొంత మంది నటీనటులు మాత్రం డబ్బుపై వ్యామోహంతో అత్యాశకు పోతూ మోసాలకు పాల్పపడుతున్నారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ సెక్స్ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మరికొంత డ్రగ్స్ దందా చేస్తు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

arrest1 compressedతాజాగా బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తన్న 200 కోట్ల భారీ మోసం కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సుకేశ్ చందశేఖర్ స్నేహితురాలు లీనా మరియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో లీనాను అరెస్టు చేశారు. లీనా పాల్ చంద్రశేఖర్.. జాన్ అబ్రహం తో కలిసి ‘మద్రాస్ కేఫ్’ మూవీలో నటించింది. భర్త జైలులో ఉండగా.. బయట నుంచి ఈ దోపిడీకి ప్లాన్ చేసినది లీనానే అని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈమెపై గతంలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల కమిషన్ లంచం కేసుతో సహా 21 కేసుల్లో నిందితుడైన చంద్రశేఖర్ గత ఆగస్టులో అరెస్టు అయ్యాడు. ఈ నేపథ్యంలో సుకేశ్ బంగ్లాపై దాడి చేసి కోట్లు విలువైన వస్తువులను, అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు..16 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సుకేశ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అతను జైలులో కూర్చునే ఈ రాకెట్‌ను నడిపించడం విశేషం.