కడుపులో దూదిని మరిచిన వైద్యులు.. ఆరునెలల గర్భిణి మృతి

Crime news

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..భువనగిరి పరిధిలోని రాయగిరికి చెందిన మమత అనే మహిళకు మొదటి కాన్పు కోసం భువనగిరిలో స్థానిక కేకే ఆస్పత్రికి తరలించారు. దీంతో మమతకు కాన్పు అనంతరం సిజిరియన్ చేసిన ఆ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆస్పత్రి వైద్యులు మమతకు ఆపరేషన్ చేసే సమయంలో కడుపులో దూది పెట్టి అలాగే కుట్లు వేశారు. దీంతో అక్కడి నుంచి మమతకు అప్పడప్పుడు కడుపులోకి నొప్పిగా ఉండటంతో అదే ఆస్పత్రికి తీసుకెళ్తే అంతా బాగానే ఉందని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇక ఇటీవల మమతకు మళ్లీ కడుపులో నొప్పిగా ఉందని తెలియటంతో హైదరాబాద్ నేరెడ్ మెట్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.

దీంతో టెస్ట్ చేసిన వైద్యులు మమత ఆరు నెలల గర్భిణి కావటంతో కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు దూది కూడా ఉందని అందుకే కడుపులో నొప్పిగా ఉందని తేల్చారు. దీంతో రెండు మూడు రోజుల పాటు ఇక్కడే చికిత్స పొందుతున్న మమత మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. ఇక మమత మరణవార్తతో మమత బంధువుల బోరున విలపించారు. ఇక మమత మరణానికి కారణమైన భువనగిరి పరిధిలోని కేకే ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.