నోవాక్జిన్? – నో వ్యాక్సిన్?!.

కరోనా సెకండ్‌ వేవ్‌ దడ పుట్టిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ తాకుతోంది. ఇలాంటి సమయంలో వ్యాక్సినే రక్ష. 60 ఏళ్లు పైబడినవారికీ, 45 ఏళ్లు దాటినవారికీ కేంద్రం ఇప్పటికే ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తోంది.వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను  మూసివేస్తున్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వ్యాక్సిన్లు అందించడానికి కంపెనీలు సిద్ధమైనా, వాటిని కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం లేదు. ప్రతి డోస్‌కు రూ.300 రేటును వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు నిర్ణయించాయి. దీని ప్రకారం నాలుగు కోట్ల డోస్‌లు కావాలంటే రూ.1600 కోట్లు వెచ్చించాలి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ కోసం రూ.1600కోట్లు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. 

download 5

తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని మాత్రం వివరించారు. . కచ్చితంగా మే 1 నుంచి టీకామందులు వేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పలేమని వారు స్పష్టం చేశారు.  నిన్నటి నుంచే నగరానికి వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. 1.5 లక్షల డోసులు రావలసి ఉండగా అది అందలేదని అధికారులు వెల్లడించారు.

download 6

మరోవైపు టీకా డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రాసెస్ కు అంతరాయం కలుగుతోంది. ఇంకోవైపు గవర్నమెంట్, ప్రైవేట్ దవాఖాన్లలో బెడ్ కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరోనా వ్యాక్సిన్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. టీకా కొరతతో ఇబ్బందులు పడుతున్నామని మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలపై కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరవలేమని తెగేసి చెబుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే కోవిడ్ టీకా కేంద్రాలు మూతపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here