కరోనా తీవ్రత నవంబరులో మళ్ళీ విజృంభించే అవకాశం!!.

హైదరాబాదులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ మూర్తి భారత్ లోని కరోనా పరిస్థితులపై స్పందించారు. మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలను అనుమతించడం వల్లే దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి కారణమైందని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీవీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత వచ్చే ఇమ్యూనిటీ మూడు నుంచి ఆరు నెలలపాటు ఉంటుంది.  ఇమ్యూనిటీ రక్షణ శాశ్వతంగా ఎవ్వరికీ ఉండదు’ అని ప్రొఫెసర్‌ మూర్తి పేర్కొన్నారు. ఈ సమయంలో ఐదు నుంచి ఆరు నెలల తర్వాత మరో ముప్పు వచ్చే ప్రమాదం ఉందని  అప్పటికి ప్రజల్లో రోగనిరోధకత తగ్గే ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే మళ్లీ నవంబర్‌ నెల ఆందోళనకరమైందని అంచనా వేశారు. మహమ్మారుల విజృంభణ సమయంలో ఒక్కో దఫా విజృంభణలో ఒక్కో వయసు వారిపై ప్రభావం చూపే ఆస్కారం కూడా ఉంటుందని తెలిపారు.

download 27

దేశంలో ముప్పైఏళ్ల వయసుపైబడిన 80శాతం మందికి వ్యాక్సిన్‌ అందించడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రొఫెసర్‌ మూర్తి పేర్కొన్నారు. భారత్ లో నవంబరులో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే, 30 ఏళ్లకు పైబడినవారిలో 80 శాతం మందికి టీకాలు ఇస్తే కరోనా వ్యాప్తిని కట్టడి చేయొచ్చని అన్నారు. కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు దేశంలో రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు జరపడం వల్లే సెకండ్ వేవ్ ప్రమాదకరంగా పరిణమించిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో చిన్నారులపై వ్యాక్సిన్‌ ప్రయోగాలను ముమ్మరం చేయాలన్నారు. అంతేకాకుండా భారీ సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలపై 2022 ఫిబ్రవరి వరకు నిషేధం విధించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కార్యాలయాలను మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించుకోవచ్చని సూచించారు. ఏదైనా అంటువ్యాధి ఒకసారి సామాజిక వ్యాప్తి జరిగితే అది అలాగే కొనసాగుతూ స్థానిక వ్యాప్తికి దారితీస్తుందని చెప్పారు. ఇలా సాధారణ ఫ్లూ మాదిరిగానే కొవిడ్‌-19 కూడా తరాలపాటు మనతోనే ఉంటుందని ప్రొఫెసర్‌ మూర్తి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరస్‌ సోకని వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక వ్యాప్తికి అవకాశం ఉంటుందన్నారు.