కృష్ణపట్నంలో వైరస్ విజృంభణ! ఆనందయ్య మందే కొంప ముంచిందా?

కరోనా కష్ట కాలంలో ఏది మంచో, ఏది చెడో కూడా అర్ధం కాని పరిస్థితిలు నెలకొన్నాయి. ఈ కష్ట కాలంలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ.. డాక్టర్స్ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడారు. కానీ.., కొన్నిరోజుల క్రితం ఆనందయ్య మందు అందుబాటులోకి రావడంతో అంతా ఆయుర్వేదం వైపు షిఫ్ట్ అయిపోయారు. లక్షలకి లక్షలు బిల్లులు వసూల్ చేస్తున్నారంటూ కార్పొరేట్ హాస్పిటల్స్ పై విరుచుకపడ్డారు. ఆనందయ్య గ్రేట్ అంటూ నినాదాలు చేసేశారు. కట్ చేస్తే ప్రభత్వం ఆనందయ్య మందుని అందుబాటులోకి రానివ్వడం లేదు. దీనికి అసలు కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఆనందయ్యని మాత్రం భద్రత పేరుతో పోలీస్ వలయంలో ఉంచేశారు. కానీ.., ఇప్పుడు ఆనందయ్యపై కూడా ఆయన సొంత ఊరిలోనే విమర్శలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆ చిన్న ఊరిలో గడిచిన 24 గంటల్లో 75 వరకు కొత్త కేసులు బయటపడినట్టు తెలుస్తోంది. ఊరి ప్రజల్లో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారట. దీంతో.., కృష్ణపట్నంలో వైరస్ గ్రూప్ స్ప్రెడ్ జరిగిందా అన్న కోణంలోవైద్య నిపుణులు ఆలోచిస్తున్నారు.

ANA 2దీంతో.., కృష్ణపట్నంలో 250 మంది ప్రజలకి ర్యాపిడ్ గా టెస్ట్ చేయాలని నిపుణులు నిర్ధారించుకున్నారు. కృష్ణపట్నంలో ఇలా కరోనా బారిన పడిన వారిలో ఆనందయ్య బంధువులే ఎక్కువగా ఉన్నారట. ఆనందయ్య శిష్యుడు సునీల్ కూడా కరోనాకి గురి అయినట్టు తెలుస్తోంది. అతని కుటుంబలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందట. దీంతో.., కృష్ణపట్నం గ్రామస్తుల్లో ఆందోళన మొదలయింది. ఈ విషయంలో గ్రామస్థులు ఆనందయ్యపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం కొన్ని వేల మంది మా గ్రామంపై పడ్డారు. వారంతా మందు తీసుకుని తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. కానీ.., వారిలో కరోనా పేషంట్స్ ఎక్కువ. వారందరి నుండి వైరస్ విజృంభించేసింది. ఈరోజు మేము ఆ మహమ్మారి బారిన పడుతున్నాం అంటే దానికి ఆనందయ్య మందే కారణం. ఆ మందు దేశం మొత్తానికి వెలుగులు పంచి.., మా గ్రామానానికి మాత్రం అన్యాయం చేసింది. ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేస్తారంటూ ఆనందయ్య సొంత గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నారట. ఇక మరోవైపు ఆనందయ్య మందు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. మరి కృష్ణపట్నంలో వైరస్ వ్యాప్తికి కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.