అమ్మ కాదు.. నీయమ్మ మొగుడు.. మహిళ వ్యాఖ్యలకు నవ్వేసిన చంద్రబాబు

అమరావతి- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అరుదుగా నవ్వుతారు. ఎందుకో ఏమోగాని ఆయన ఎక్కువగా సీరియస్ గానే ఉంటారు. చాలా తక్కువ సందర్బాల్లో నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతారు చంద్రబాబు. తాజాగా చాలా కాలం తరువాత చంద్రబాబు పగలబడి నవ్వడం అందరిని ఆకట్టుకుంది. ఈ ఘటన చంద్రబాబు నిరసన దీక్షలో చోటుచేసుకుంది.

వైసీపీ ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు నిరసన దీక్షలో చివరి రోజు ఓ టీడీపీ మహిళా కార్యకర్త స్టేజీ మీద నవ్వులు పువ్వులు పూయించింది. ఆమె మాట్లాడిన మాటలకు దీక్షలో కూర్చున్న చంద్రబాబు, ఆయన పక్కనే కూర్చున్న అచ్చెన్నాయుడు విరగబడి నవ్వారు. చంద్రబాబు అలా నవ్వడం చూసి నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారంటే నమ్మండి.

Babu

చంద్రబాబు నాయుడు నిరసన దీక్షలో భాగంగా శుక్రవారం ఓ మహిళా కార్యకర్త మైక్ తీసుకొని వైసీపీ నేతలపై సెటైర్లు వేసింది. ఆమె మైక్ పట్టుకున్నప్పటి నుంచి చంద్రబాబుతో సహా అక్కడున్న నేతలు, కార్యకర్తలు విరగబడి నవ్వారు. మరీ ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆ మహిళా కార్యకర్త విమర్శించిన తీరు అక్కడ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది.

ఆమె కొడాలి నానిని ఏమందంటే.. లారీలు కడుక్కునే మంత్రి.. నువ్వు మాట్లాడేది బూతు కాదా.. పంచాగమా.. భగవద్గీతా.. ఖురానా .. నువ్వు చెప్పే బూతులు ఏంటీ అమ్మా మొగుడు.. అమ్మ కాదు నీ యమ్మా మొగుడు.. అది బూతు కాదా.. అది చక్కనైనా ల్యాంగ్వేజా.. అది చక్కనైన భవిష్యత్ వచ్చే భూత వర్తమాన కాలమా.. బూతుల మంత్రి.. అని ఆమె సెటైరికల్ గా మాట్లాడటంతో చంద్రబాబు సహా అక్కడున్నవారంతా ఏంచక్కా నవ్వేశారు.