మీదపడ్డ చిరుతను తరిమికొట్టిన బామ్మ.. వీడియో వైరల్‌

The tiger that attacked the old woman - Suman TV

వీధి కుక్క మీదకొస్తేనే భయపడతాం.. అలాంటిది ఏకంగా చిరుత పులి గాండ్రీస్తూ మీదపడితే ఇంకేమైనా ఉందా.. ఊహించుకుంటేనే వణుకుపుడుతుంది కదూ? ఈ వీడియోలో అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. కానీ ఇక్కడ భయపడి పారిపోయే వంతూ చిరుతది. బామ్మ ధైర్యానికి బెంబెలెత్తిన చిరుత పరుగు లంఘించుకుంది. చాకచక్యం వ్యవహరించిన బామ్మ దాని నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

The tiger that attacked the old woman - Suman TVThe tiger that attacked the old woman - Suman TVముంబై శివారులో గోరెగావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చిరుతతో ఆ వృద్ధురాలు చేసిన పోరాటం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మలా దేవీ సింగ్‌ అనే వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలిసిముంబైలోని అరేయ్ డెయిరీ ఏరియాలో నివసిస్తోంది. ఆమెకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సరిగా నడవలేదు. వాక్ స్టిక్ సాయంతో మాత్రమే నడుస్తుంది. ఐతే సెప్టెంబర్ 29న రాత్రి 7:47 గంటల సమయంలో తమ ఇంటి ముందు అరుగుపై కూర్చింది. అప్పటికే ఆమెకు కొంత దూరంలో ఓ చిరుత ఉంది.

కానీ నిర్మలా దేవీ గమనించలేదు. నిర్మలా దేవి కూర్చోగానే.. చిరుత నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె వద్దకు వచ్చింది. అనంతరం ఆమెపై దాడిచేసింది. పంజా విసరడంతో నిర్మలా దేవి కిందపడిపోయింది. కానీ వెంటనే తేరుకుని తన చేతి కర్రతో చిరుతపై ఎదురు దాడి చేసింది. కర్రతో చిరుత ముఖంపై కొట్టడంతో అది భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయింది.

ఇదీ చదవండి: ఈఫిల్ టవర్ దగ్గర యువకుడి అద్భుత సాహసం, సన్నని తాడుపై