తల్లి ప్రేమతో మృత్యుంజయుడైన కుర్రాడు!..

చనిపోయిన వారు బతికి బట్టకడతారా? ఇది నమ్మశక్యం కాకపోయినా అక్కడక్కడ జరుగుతుంటాయి. లక్షల్లో ఒకరు ఇలా చచ్చిపుడతారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో తల్లిమాటలతో ఆరేళ్ల బాలుడు లేచి కూర్చుకున్నాడు. చనిపోయాడ‌నుకున్న బాలుడు లేచి కూర్చోవ‌డంతో గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ అంతా అమ్మ ప్రేమ అంటూ మెచ్చుకున్నారు. హ‌ర్యానాలోని బ‌హ‌దూర్‌గ‌ఢ్ ప్రాంతానికి చెందిన హితేష్‌, ఝాన్వి దంప‌తుల‌కు ఆరేండ్ల కుమారుడు ఉన్నాడు. టైఫాయిడ జ్వ‌రం ఎంత‌కూ త‌క్కువ కాక‌పోవ‌డంతో చికిత్స ఇప్పించేందుకు ఆ పిల్లాడ్ని ఢిల్లీలోని ఓ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. హితేష్ చికిత్స పొందుతూ మే 26 న చ‌నిపోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు. దీంతో హతేష్ మృత‌దేహంతో తల్లిదండ్రులు హర్యానాకు తిరిగొచ్చారు.

Hitesh.jpg02అంత్య‌క్రియ‌లు చేప‌ట్టేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.ఇక రాత్రంతా పిల్లాడి శ‌వం వ‌ద్ద ఏడుస్తూ త‌ల్లిదండ్రులు గ‌డిపారు. అంత్య‌క్రియ‌లు చేప‌ట్టేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాత్రంతా శ‌వం వ‌ద్ద జాగార‌ణ చేస్తూ త‌ల్లిదండ్రులు గ‌డిపారు. చనిపోయాడని తెలిసినా కొడుకుతో ప్రేమగా మాట్లాడుతూ., త‌ల్లి అమాయ‌కంగా పిల్లాడ్ని మృత‌దేహాన్నిఅటూ ఇటూ క‌దిపింది. దాంతో పిల్లాడి శ‌రీరంలో క‌ద‌లిక క‌నిపించ‌డంతో ఒక్క‌సారి ఆశ్చ‌ర్య‌పోయిన తండ్రి వెంట‌నే తేరుకుని పిల్లాడి శ‌రీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు. సినిమాల్లో చూసిని సీన్ గుర్తుకొచ్చి పొరుగింటి యువ‌కుడు పిల్లాడి ఛాతీపై గ‌ట్టిగా ఒత్తడంతో ఒక్క‌సారి పిల్లాడి గుండె కొట్టుకోవ‌డం ప్రారంభ‌మైంది. దాంతో చికిత్స నిమిత్తం పిల్లాడ్ని హుటాహుటిన రోహ‌త‌క్ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. పూర్తిగా కోలుకున్న బాలుడిని మంగ‌ళ‌వారం ఇంటికి తీసుకొచ్చారు.

అయితే జరిగిన సంఘటనపై ప్రభుత్వ వర్గాలు కాని, వైద్య వర్గాలు కాని ఎలాంటీ ప్రకటన చేయలేదు.  ఎలా జరిగి ఉంటుందనే విషయమై ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఉంది.  పిల్లాడు బతికిన వార్త బయటకు రావడంతో ప్రభుత్వం ఎలాంటీ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.