బేబీ షార్క్ డ్యాన్స్ సాంగ్.. యూట్యూబ్ లో 1000 కోట్ల వీవ్స్

ఇంటర్నేషనల్ డెస్క్- బేబీ షార్క్ డ్యాన్స్.. ఈ పాట గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. యూట్యూబ్ లో బేబీ షార్క్ డ్యాన్స్ సాంగ్ అంటే దాదాపు తెలియని వారుండరు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించిన బేబీ షార్క్ డ్యాన్స్ పాట, ఇప్పుడు మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

దక్షిణ కొరియా ఎడ్యుకేషన్‌ అండ్‌ రైమ్స్‌ క్రియేట్‌ కంపెనీ పింక్‌ ఫాంగ్‌ రూపొందించిన బేబీ షార్క్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో మోస్ట్‌ వ్యూస్‌ సాంగ్‌ ఘనత దక్కించుకుంది. తాజాగా పది బిలియన్‌ల వ్యూస్‌ను దాటేసి.. యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన వీడియోగా రికార్డుల్లోకెక్కింది. అంటే ఈ వీడియో ఎకంగా వెయ్యి కోట్ల వ్యూస్ ను సాధించిందన్నమాట.

Baby Shark Dance 1

ప్రపంచ జనాభానే దాదాపు 7.8 బిలియన్‌ గా ఉండగా, బేబీ షార్క్ సాంగ్ మాత్రం 10 బిలియన్‌ వ్యూస్‌ రాబట్టడం విశేషం. ఈ వీడియోకు యూట్యూబ్‌ ఆల్గారిథం ప్రకారం అదనంగా మరో 2 బిలియన్‌ వ్యూస్‌ జత అయ్యాయన్నమాట. ఇద్దరు చిన్న పిల్లలు.. బేబీ షార్క్‌ డు డు డు.. అంటూ లయబద్ధంగా స్టెప్పులు వేయడం, ఆ వెనుక బేబీ షార్క్‌తో పాటు మామ్మీ, డాడీ, గ్రాండ్‌పా, గ్రాండ్‌మా షార్ట్‌లు రావడం.. ఇలా సాగుతుందని ఆ పాట.

కొరియన్, అమెరికన్ గాయని హోప్ సెగోయిన్ తన 10 ఏళ్ల వయస్సులో ఈ సాంగ్‌ పాడింది. 2016లో ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది పింక్‌ ఫాంగ్. ఈ క్రమంలో 2020 నవంబర్ లో ఈ వీడియో సాంగ్‌ 7 బిలియన్ వ్యూస్ దాటి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకుంది. ప్యూర్టో రికన్‌ పాప్‌ స్టార్లు లూయిస్‌ ఫోన్సి, డాడీ యాంకీ కంపోజ్‌ చేసిన డెస్‌పాసిటో యూట్యూబ్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.