సోనూసూద్ కోసం ఈ పాప చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

ప్రార్ధించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఇప్పుడు మన దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు సైతం కొన్ని చోట్ల చేతులు ఎత్తేశాయి. కానీ.., మనసున్న మహారాజులు మాత్రం కేవలం మాటలు చెప్పి సరిపెట్టకుండా.., సమాజం కోసం తమకి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అందరికన్నా ముందు చెప్పుకోవాల్సింది సోనూసూద్ గురించే. కరోనా ఫస్ట్ వేవ్ లోనే సోను తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. వలస కూలీలను తమ ఇళ్ళకి చేర్చి రియల్ హీరో అయ్యాడు. ఇందుకోసం రైళ్లు, విమానాలు, సొంత వాహనాలు అన్నీ వాడేశాడు సూనుసూద్. దీనితో.. ఒక్కసారిగా దేశం అంతా అతని వైపు తిరిగి చూసింది. ఆ తరువాత కూడా సోను తన సేవా గుణాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు. కష్టాల్లో ఉన్న ఆడ పిల్లలకి అన్న అయ్యాడు. అనాధ వృద్దులకు కొడుకు అయ్యాడు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపి దేవుడు అయ్యాడు. ఇక ఈ సెకండ్ వేవ్ సమయంలో కూడా సోనూసూద్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయుల కోసం ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్స్ సైతం నిర్మించేస్తునాడు ఈ రియల్ హీరో. ఇలాంటి సమయంలో దేశం అంతా ఇప్పుడు సోనూసూద్ వెంట నడవడానికి సిద్ధంగా ఉంది. ప్రజల కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచన ఉన్న వారు.., ప్రభత్వాలకి కాకుండా సోనూసూద్ ట్రస్ట్ కి విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి సోనూసూద్ ట్రస్ట్ కి రూ.4 వేల విరాళంగా ఇచ్చింది. అవ్వడానికి ఇది చిన్న మొత్తమే అయినా.., దీని వెనుక ఈ చిట్టి తల్లి పడ్డ కష్టం చాలానే ఉంది.

papa 2

సోనూసూద్ ఫౌండేషన్ కు ఓ ఎస్సై కూతురు విరాళం అందించి ఉదారతను చాటుకున్న ఘటన ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ అంతా ఈ చిన్నారి దయా గుణం పై చర్చ జరుగుతోంది. కరీంనగర్ కు చెందిన ఎస్ఐ భరత్ రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె ఆరాధ్య వయసులో చిన్నదైనా… తన పెద్ద మనసు చాటుకుంది… తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను కిడ్డీ బ్యాంకులో దాచుకోవడం ఆరాధ్యకి అలవాటు. ఒక రూ.5 వేల అయ్యాక.. తనకి నచ్చిన బొమ్మ కొనుక్కోవాలి అన్నది ఆరాధ్య ఆలోచన. ఇందుకోసం ఈ పాప 6 నెలలుగా డబ్బులు దాచుకుంటూ వస్తోంది. కానీ.., ఓ రోజు ఉన్నట్టు ఉండి తన డబ్బులు అన్నీ లెక్క కట్టింది. రూ.4 వేల అయ్యాయి. ఆరాధ్య వెంటనే తన తండ్రి వద్దకి వెళ్లి.., నాన్న ఇవి నేను బొమ్మ కోసం దాచుకున్న డబ్బులు. కానీ.., ఇపుడు నాకు బొమ్మ వద్దు. ఈ నాలుగు వేల రూపాయలను నా తరుపున సోనూసూద్ అంకుల్ పౌండేషన్ కు విరాళంగా ఇవ్వండి అని చెప్పింది చిన్నారి ఆధ్య. తన కుమార్తె తనకి తానుగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడంతో ఆ తల్లిదండ్రులు ఆరాధ్య చెప్పినట్టే ఆ డబ్బుని సోనూ ఫౌండేషన్ కి విరాళంగా అందచేశారు. కాగా.., ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆరాధ్య స్పందించింది. ఆరాధ్య మాట్లాడుతూ.. నాన్ వాట్సాప్ ప్రొఫైల్లో సోనూసూద్ అంకుల్ ఫోటో ఉండటాన్ని గమనించాను. సోనూసూద్ అంకుల్ పేదలకు, కరోనా బాధితులకు చేస్తున్న సేవల గురించి నాన్న చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తికి తన వంతు సహాయంగా దాచుకున్న డబ్బులు విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది ఆరాధ్య. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవడంతో చిన్నారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చూశారు కదా..? ఈ చిట్టితల్లి చేసిన మంచి పని మీఎకు నచ్చినట్టు అయితే.. ఆరాధ్యని కామెంట్స్ రూపంలో అభినందించండి.