రాష్ట్ర శాసనసభలో పెరుగుతోన్న వైసీపీ బలం!..

టీడీపీ ఎమ్మెల్సీల ప‌ద‌వి గ‌డువు ముగియ‌డంతో ఆ బ‌లం వైసీపీకి పెరుగుతోంది. ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు త‌మ ప‌ద‌వుల గ‌డువు అయిపోవ‌డంతో వారు రిటైర్ అవుతున్నారు. అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రిటైర్ అవుతున్నారు. ఇంకోవైపు వైసీపీకి గవర్నర్‌ కోటాలో ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు అందుబాటులోకి వ‌స్తున్నారు. దీంతో శాసనమండలిలో టీడీపీ సంఖ్య 22 నుంచి 15కు త‌గ్గిపోతోంది. ఇంకోవైపు వైసీపీ బ‌లం విప‌రీతంగా పుంజుకుంటోంది. న‌లుగురి రాక‌తో వైసీపీ బ‌లం 17 నుంచి 21కి పెరుగుతోంది.

AP Mapఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌బోతోంది. ఇక దాంతో మండ‌లిలో వైసీపీకి ఎదురే లేకుండో పోనుంది. ప్ర‌భుత్వం ఏ చ‌ట్టం చేసినా మండ‌లిలో నెగ్గుకురావ‌డం కష్ట‌మైంది. కానీ ఇప్పుడు ఆ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు పంపింది. జూన్‌ 11తో ఎమ్మెల్సీలు టీడీ జనార్దన్‌, బీద రవిచంద్ర, గౌనిగారి శ్రీనివాసులు, పి.శమంతకమణిల పదవీ కాలం ముగిసింది. ఖాళీ అయిన స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు కూడా దాదాపు ఖరారయ్యారు.

ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  ఆమోదం తెలిపారు.   నాలుగు స్థానాలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్, మోషేన్ రాజు లు ఎమ్మెల్సీలుగా ఎంపికకు లైన్ క్లియర్ అయింది. వీరు త్వరలోనే ఎమ్మెల్సీ పదవులు చేపట్టనున్నట్లు సమాచారం.