విశాఖ పట్నం బీచ్ లో అదృశ్యం అయిందన్న సాయి ప్రియ కేసులో ఎన్నో కీలక మలుపులు జరిగాయి. అయితే ఈ అదృశ్యం వెను పెద్ద స్కెచ్ ఉన్నట్లు బయటపడింది. ఆమె భర్తతో పాటు బీచ్ కి వచ్చి ఫోన్ మాట్లాడుతా అంటూ తన ప్రియుడితో వెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సాయి ప్రియ కేసు హాట్ టాపిక్ గా మారింది. అయితే సాయి ప్రియ భర్త తీసుకున్న నిర్ణయంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడింది. వివరాల్లోకి వెళితే..
విశాఖ ఎన్.ఎ.డి. సమీపంలోని సంజీవయ్య నగర్‌కు చెందిన 22 ఏళ్ల సాయిప్రియకు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో ఆమె తన ప్రియుడిని మళ్లీ వివాహం చేసుకుంది. తన ప్రియుడిని వివాహం చేసుకున్న సాయి ప్రియ మేజర్ కావడంతో ఆమె ఇష్టానుసారంగానే వెళ్లమని ఆమె భర్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బెంగళూరు నుంచి పోలీసులు ఆమెను విశాఖ తీసుకొచ్చారు.. కౌన్సిలింగ్ ఇవ్వాలని భావించారు. కానీ భర్త రాకపోవడంతో ఆమెను ప్రియుడితో పంపించేశారు.
శ్రీనివాసరావుతో తనకు ఇష్టం లేని వివాహం చేశారని.. తనతో ఉండలేక.. తాను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక ఈ పని చేశానని అన్నారు సాయి ప్రియ. తమ వలన ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణ కోరుతున్నామన్నారు సాయిప్రియ జంట. శ్రీనివాస్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పానని.. చిన్నప్పటి నుంచి రవిని ఇష్ట పడ్డానన్నారు. శ్రీనివాస్ పెళ్లి రోజు గిఫ్ట్ గా ఇచ్చిన బంగారు గాజులు ఆయనకే ఇచ్చేస్తానన్నారు. తాము ఇద్దరం చదువుకున్నామని.. ఏదో ఒక ఉద్యోగం చేసుకొని జీవిస్తామని అన్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.