నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా : పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఏపిలోని అనంత రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ప్రత్యేక పేరు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం అధికారంలో ఉన్న సమయంలో పరిటాల సతీమణి పరిటాల సునిత మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

image 1 compressed 53ఈ సందర్భంగా నా బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నా అంటూ కీలక ప్రకటించారు పరిటాల సునీత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన బిడ్డను ఆశీర్వదించాలని ధర్మవరం ప్రజలకు విజ్ఙప్తి చేశారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సునీత.. అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను పోటీ దింపారు. ఆ సమయంలో 25వేల ఓట్ల తేడాతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతపురం రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న పరిటాల కుటుంబం ఈ సారి మాత్రం ధర్మవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

ఇది చదవండి : సజ్జనార్‌ వినూత్న ఆలోచన.. ఇంటి వద్దకే బస్‌

image 0 compressed 53ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీ అతనిని ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అందుకే ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల సునీతతో కలిసి పరిటాల శ్రీరామ్ పర్యటించారు. ఇదే సందర్భంలో పరిటాల శ్రీరామ్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు తల్లి పరిటాల సునీత. మరి పరిటాల శ్రీరామ్ ధర్మవరం ప్రజల మన్ననలు ఎలా పొందుతాడు.. గెలుపు తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అన్ని రాబోయే ఎన్నికల్లో తెలిసిపోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.