గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వైసీపీ వర్సెస్ ప్రతిపక్షం టీడీపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పడేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అంతే కాదు ఇరు పక్ష నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా చేరుకున్న చంద్రబాబు.. గొల్లప్రోలులో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఇది చదవండి: Bojjala: బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంటే చంద్రబాబుకి ఎందుకు అంత ఇష్టం?
ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌లోని ఓ కారును పట్టుకుని ముందుకు సాగిన టీడీపీ కార్యకర్త ఒకరు పట్టు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలు కాగా… వెంటనే పార్టీ శ్రేణులు అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కార్యకర్తకు గాయాలు అయిన విషయం తెలుసుకున్న చంద్రబాబు అతనికి మెరుగైన వైద్యం అందించేలా వైద్యులను కోరినట్టు తెలుస్తుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.