నా బిడ్డల నోటి కాడ డబ్బంతా రాజకీయాల కోసం ఖర్చు చేస్తున్నా

మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతల తీరును విమర్శించారు. ఆడబిడ్డలకు నేను చాలా గౌరవం ఇస్తాను. నేనుప్పుడు హద్దులు దాటి మాట్లాడలేదు. నేను వైసీపీలో అధినేత మొదలు ఏ మహిళ గురించి తప్పుగా మాట్లాడను.. మాట్లాడలేదు. పాలిటిక్స్ లో నాకు ఎవరూ లేరు.. మా నాన్నా ముఖ్యమంత్రి కాదని.. హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది అన్నారు. మా నాన్న కార్లు.. బంగ్లాలు ఇవ్వలేదు.

ఇడుపుల పాయ లాంటి ఎస్టేట్ ఇవ్వలేదని.. వేల కోట్లు ఇవ్వలేదని చెబుతూ.. తన తండ్రి తనకు ఇచ్చింది ధైర్యం..తెగింపు,.,ధర్మ రక్షణ అని చెప్పుకొచ్చారు. నేను ఒకప్పడు ఐదు వేల కోసం సినిమాలు తీశాను.. తర్వాత కోట్లు తీసుకున్నా.. అవన్నీ ప్రజల కోసం ఖర్చు చేశానని.. పార్టీ నిలబెట్టడం కోసం ఎన్నో కష్టాలు పడ్డానని.. నా బిడ్డల పేర ఉన్న ఎఫ్ డీ లు కూడా తీసుకు వచ్చి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నా అన్నారు.

నాకు ప్రజల కష్టాలు తెలుసు.. వారి కోసం నాకు పోరాడటమే తెలుసు అన్నారు. ఎవరో చెప్పినట్లు నేను కోట్లు వెనుక వేసుకోవడం లేదు.. నాకు డబ్బు దాచుకోవడం తెలియదు అంటూ తన ఆర్థిక కష్టాల గురించి చెప్పారు పవన్ కళ్యాణ్.