తిరుపతిలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. నీళ్ల ట్యాంక్‌ ను శుభ్రం చేస్తుండగా..

తిరుమల- తిరుపతిలో ప్రజలు వర్షాలతో పడిన ఇక్కట్లు చూసి యావత్‌ రాష్ట్రమే కళ్లనీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతానికి వరుణుడు శాంతించాడని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో తిరుపతిలో మరో వింత ఘటన జరిగింది. వాటర్‌ ట్యాంక్ లో దిగి మహళ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఆ ట్యాంక్‌ భూమి నుంచి పైకొచ్చింది. భయాందోళన చెందిన మహిళ కేకలు వేయడంతో ఆమె భర్త వచ్చి బయటకు తీశాడు.

tankవివరాల్లోకి వెళితే.. తిరుపతి శ్రీకృష్ణానగర్‌ లో ఈ వింత జరిగింది. శుభ్రంచేస్తుండగా 25 అడుగుల వాటర్‌ ట్యాంకర్‌ ఒక్కసారిగా పైకి వచ్చింది. 18 సింమెంట్‌ ఒరలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వారికి ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. యూనివర్సిటీ నుంచి జియాలజిస్టులను పిలిపించి దర్యాప్తు చేపిస్తామని హామీ ఇచ్చారు. ‘ఇదేదో అతీత శక్తి అని భ్రమల నుంచి బయటకు రండి. ఇప్పటికి వరకు కురిసిన వర్షాలకు ఇలా జరిగిఉంటుందేమో అని నేను భావిస్తున్నాను. స్థానికుల్లో భయం పోగెట్టేందుకే నేను స్వయంగా వచ్చాను’ అంటూ ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.