చంద్రబాబుపై RGV మరో సంచలన ట్వీట్‌..

rgv jagan chandrababu

వివాదాస్పద డైరెక్టర్‌ ఆర్జీవీ సినిమా, సామాజిక, రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా ఆయనకు ఏది నచ్చితే దానిపై స్పందిస్తూనే ఉంటాడు. తాజాగా ఏపీలో జరిగిన అతిపెద్ద రాజకీయ సంచలనం.. చంద్రబాబు లైవ్‌ లో కన్నీటి పర్యంతం అవ్వడం. ఆ ఘటన జరిగిన వెంటనే ఆర్జీవీ సామెతలను ఉపయోగించి ‘ఏడ్చే మగాళ్లను నమ్మకూడదు’ అంటూ చేసిన ట్వీట్‌ వైరల్‌ అయిన విషయం తెలిసందే. అదే ఘటనపై సిరీస్‌ ఆఫ్‌ ట్వీట్స్‌ చేస్తూనే ఉన్నాడు. మరో ట్వీట్‌ తో చంద్రబాబుపై అక్కసును వెళ్లగక్కాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.rgv jagan chandrababu

రియల్‌ హీరో- రీల్‌ హీరో..

గతంలో జగన్‌ మాట్లాడిన వీడియోని.. లైవ్‌ లో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలను కలిపి ఉన్న ఒక వీడియోని వర్మ ట్వీట్‌ చేశాడు. దానికి క్యాప్షన్‌ రీల్‌ మ్యాన్‌ కు రియల్‌ మ్యాన్‌ కు ఉన్న వ్యత్యాసం అంటూ ట్వీట్‌ చేశాడు. అందులో సీఎం జగన్‌ ‘అవతలి వ్యక్తి ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకున్నాం అనేదే విన్నింగ్‌ కు నాంది. కొట్టారు తీసుకున్నాం. మా టైమ్‌ వస్తుంది కొడతాం’ అన్న వీడియోని.. చంద్రబాబు ఏడ్చిన వీడియోని ట్వీట్‌ చేశాడు. రామ్ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.