తిరుపతి, కడపకు మరోసారి భారీ వర్షాలు! భయం గుప్పిట్లో ప్రజలు!

అకాల వర్షాలతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల అయితే భారీ వర్షాలతో నదులను తలపించాయి. కొద్ది రోజులు ఊపిరి పీల్చుకున్న తర్వాత మళ్లీ వరుణుడి పంజా విసురుతున్నాడు. అల్పపీడన ధోరణి కారణంగా తిరుపతి, నెల్లూరులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరికొన్ని అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తిరుపతిలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. వర్షం నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు కడప జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాపై కూడా పడుతుందని తెలిపారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వర్షాలతో అల్లాడుతున్న తిరుపతి ప్రజలపై ఇంకా వరుణుడి కనికరించడం లేదు. కొందరైతే తిరుపతిపై ప్రకృతి పగపట్టిందేమో అందుకే ఈ వర్షాలు అంటూ చెప్పుకొంటున్నారు. కడప జిల్లా కూడా అకాల వర్షాలతో అతలాకుతలం అయ్యింది. ఎందరో ఇళ్లు, ప్రాణాలు కోల్పోయారు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కురుస్తాయంటూ భయాందోళన చెందుతున్నారు. తిరుపతి అకాల వర్షాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.