ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు.. అత్తారింటికి చిత్రంలోని ఈ డైలాగ్ తెలుగునాట చాలా ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కి ఈ డైలాగ్ సరిగా సరిపోతుంది అంటారు ఆయన అభిమానులు, ఆయన గురించి తెలిసిన వారు. సినిమా హీరో, రాజకీయ నాయకుడిగా కన్నా కూడా.. మంచి మనసున్న మనిషిగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నాడు పవన్. ఆయన గుప్త దానాల గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ స్థాపించి కొద్ది కాలమే అవుతున్నప్పటికి.. దేశ వ్యాప్తంగా పలువురు కీలక నేతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీలోని అగ్ర నేతలందరితో పవన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలను, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు, కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు.
పవర్ స్టార్ సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ అంతే యాక్టివ్‌గా కన్పిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమం, ఏపీలో అధ్వాన రోడ్లకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం, కౌలు రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం వంటివి చేస్తున్నారు. ఈక్రమంలోనే గతంలో కంటే జనసేన పార్టీ ఏపీలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన చెప్పుకొదగిన సీట్లు సాధించి వైసీపీ, టీడీపీలకు ఝలక్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కౌలు రైతు భరోసాకు తన పెన్షన్‌ను విరాళంగా ఇచ్చిన పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి
జనసేన చేపడుతున్న కౌలు రైతు భరోసా యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఏపీలోని నాలుగు జిల్లాల్లో పవన్ కల్యాణ్ కౌలు భరోసా యాత్రను ఇప్పటికే పూర్తి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన నుంచి లక్ష రూపాయాల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. అదేవిధంగా జనవాణి పేరుతో మరో కార్యక్రమానికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: 30 Years Industry Prudhvi Raj: ప్రజల్లో మార్పు వచ్చింది! 2024లో పవన్ కళ్యాణే సీఎం: 30 ఇయర్స్ పృథ్వి!
ప్రజా సమస్యలపై పవన్ పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన వీర మహిళలకు రాజకీయ శిక్షణ తరగతులను ఇప్పిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి.. వంటి అంశాలపై వీర మహిళలకు జనసేన శిక్షణ అందిస్తోంది.
ఈ క్రమంలో శిక్షణ అనంతరం వీర మహిళలతో కలిసి జనసేనాని ఫోటోలు దిగారు. ఇవి నెట్టింట్లో వైరల్‌కాగా.. వీటిలో ఒక ఫోటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలో పవన్.. ఓ వీర మహిళ పాదాల వద్ద కూర్చుని.. ఆమెతో మాట్లాడారు. వికలాంగురాలైన ఆ యువతి దగ్గరకు వెళ్లి… కింద ఆమె కాళ్ల దగ్గర కూర్చుని.. సదరు యువతి చెప్పేది శ్రద్దగా విన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జన సైనికులు, పవన్ అభిమానులు.. ‘‘దటీజ్ పవన్ కళ్యాణ్.. సింప్లిసిటీకి నిలువెత్తు రూపం ఆయన’’.. ‘‘ఎక్కడ నెగ్గాలో కాదో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు.. అదే పవన్ కళ్యాణ్’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
దివ్యంగులు పడుతున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. 1/3#JanaVaaniJanaSenaBharosa pic.twitter.com/hiGodICzjX
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 3, 2022
ఇది కూడా చదవండి: Pawan Kalyan: సూపర్ హిట్ తమిళ సినిమా రీమేక్‌లో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్