జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురంలో ప్రారంభించిన కౌలు రైతు భరోసా యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. కౌలురైతు కుటుంబాలను కలుసుకొని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, పార్టీపై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. భూం భూం బీర్లు అమ్మడమే అభివృద్ధా అని పవన్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: పవన్ యాత్రలో అపశృతి! కింద పడ్డ పోలీస్ ని పైకి లేపిన పవన్!
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మరికొన్ని కుటుంబాలను పరామర్శించి .. చింతలపూడిలో ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..” సీఎం పదవికి నేను గౌరవం ఇస్తున్నాను. అందుకే మీరు అని అంటున్నాను. అహంకారంతో విర్రవీగితే ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు. వైసీపీ నేతలకు సంస్కారం లేదు. భూం భూం బీర్లు అమ్మడమే అభివృద్ధి అని భావిస్తున్నారా? ఇప్పుడు నా సభలకు వచ్చిన యువత వైసీపీని నమ్మింది. వైసీపీ నాయకులు పేదల కన్నీళ్లు తుడవలేకపోతే నేను కచ్చితంగా ప్రశ్నిస్తాను. ప్రజల పన్నులతో వచ్చిన నిధుల్ని మీరు ఇస్తున్నట్లు చెప్పడం ఏంటి? వైసీపీ ప్రభుత్వం ఘోరమైన పాలన చేస్తోంది. సమస్యకు పరిష్కారం చెప్పకుండా నేను మాట్లాడను. ప్రతి సమస్య మీ వల్లే వచ్చిందని నేను వైసీపీని అనడం లేదు. విజయవాడ అత్యాచార ఘటన విషయంలో పోలీసుల్ని నేను ఏమీ అనలేదు. వైసీపీ నాయకుల ఆగడాలకు పోలీసులు సైతం విసుగిపోతున్నారు” అంటూ పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. మరి.. పవన్ కల్యాణ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.