టాలీవుడ్ ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ పరంగా రోజు రోజుకు బలపడుతున్నాడనే చెప్పాలి. అయితే పవన్ ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో సైతం పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏపీలో అధికార ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారి ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ప్రజలకు అండగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ #GoodMorningCmsir అనే హ్యాష్ టాగ్ తో ఏపీలోని రోడ్డ దుస్థితిపై ప్రభుత్వం తీరును ఎండగడుతోంది.
ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఎప్పటికైన ఏదైన పార్టీలో విలీనం చేయకతప్పదని కొందరు రాజకీయ నాయకులు అంటుంటారు. ఈ అంశంపై పవన్ ఎన్నోసార్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే జనసేన పార్టీ విలీనంపై తాజాగా పవన్ మరోసారి పూర్తి కారిటీ ఇచ్చారు. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: YSRCP కార్యకర్త మరణం.. పాడె మోసిన మంత్రి!
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ ఎంతో మంది జనసేన పార్టీని ఏదైన పార్టీలో విలీనం చేస్తారా? అని అడుగుతుంటారు. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా.. జనసేన ఏ ఒక్కరికి కూడా భయపడదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని విలీనం చేయను. రాబోయే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నా పోరాటం, ప్రయాణం మాత్రం ఆగదు. రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి అభ్యర్దిగా ఎవరూ నిలబడినా వారిలో నన్ను చూడండి, వాళ్లు తప్పు చేస్తే దోషిగా నేను నిలబడతానంటూ పవన్ అన్నారు. ఇక ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ దుమ్మెత్తిపోశారు. తాజాగా జనసేన విలీనంపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.