పశ్చిమ గోదావరి తణుకు మండలం దువ్వలో వైసీపీ కార్యకర్త, కడియం శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. కడియం శ్రీనివాస్ వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. గతంలో ఎంపీటీసీ గా పలువురి మన్ననలు పొందాడు. ప్రస్తుతం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కి ముఖ్య అనుచరుడిగా పనిచేస్తున్నారు.
గత కొంత కాలంగా కడియం శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. తన ముఖ్య అనుచరుడు చనిపోవడంతో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించి.. శ్రీనుకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పాడె మోశారు మంత్రి నాగేశ్వరరావు.
ఒక మంత్రి తన కార్యకర్తల పట్ల ఉన్న నిబద్దత ఎంతో ప్రశంసనీయం అంటన్నారు స్థానికులు. రాష్ట్ర మంత్రి అయి ఉండీ కూడా.. ఓ కార్యకర్త పాడె మోసిన మంత్రిపై అభినందనలు కురిపించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఆ విషయంలో వాహనదారులకు భారీ ఊరట!