ఏపీలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కష్టం ఏమిటి? ఎవరు కరెక్ట్? పవనా? జగనా?

Pavan Kalyan Sensational Comments on Movie Tickets - Suman TV

తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలను, సినిమాను విడదీసి చూడలేము. అయితే.., రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఓ కష్టం వచ్చిందని అంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. అది కూడా ప్రభుత్వం విధాన పరంగా తీసుకున్న నిర్ణయం కారణంగా. అసలు ప్రభుత్వమే ఆన్ లైన్ లో సినిమా టికెట్స్ అమ్మితే ఒక అకౌంటబులిటి ఉంటుంది, ట్యాక్స్ సరిగ్గా వస్తాయి, ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏమిటి అనేది ప్రభుత్వ వాదన. కానీ.., పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటున్నారు. మరి.. ఈ మొత్తం వ్యవహారంలో లెక్క ఎక్కడ తప్పుతుంది? ప్రభుతం లెక్క కరెక్టా? పవన్ కళ్యాణ్ లెక్క కరెక్టా? ఇక్కడ హీరో ఎవరు? విలన్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ వాదన:

Pavan Kalyan Sensational Comments on Movie Tickets - Suman TV

ఏ రాష్ట్రంలో అయిన సినిమాకి వచ్చిన కలెక్షన్స్ బట్టి.. ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్స్ కి టికెట్ రేటు ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలోని కావలి లాంటి ఒక మున్సీపాలిటిలో టికెట్ రేటు 80 రూపాయలు ఉంటే.. ఆ టికెట్ రేటులో 24 శాతం ట్యాక్స్ ప్రభుత్వానికి రావాలి. కానీ.., ట్యాక్స్ పే చేసే సమయంలో టికెట్ రేటు 30 రూపాయులుగా చూపించి, ఆ ముప్పై రూపాయలకే ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ ట్యాక్స్ లు పే చేస్తున్నారు. అది కూడా 1000 టికెట్స్ అమ్మితే 800 టికెట్స్ కి మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు.

కలెక్షన్స్ లెక్క చూస్తే మాత్రం వందల కోట్ల రూపాయలు దాటిపోతుంది. మరి.. ఆ ట్యాక్స్ డబ్బు అంతా ఎక్కడికి పోతున్నట్టు? ఎవరి జేబులు నింపుతున్నట్టు? ఇక్కడ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా బ్లాక్ మనీ రూపంలో వ్యక్తుల అకౌంట్ లోకి వెళ్ళిపోతోంది. వీటన్నిటికీ బ్రేక్ వేసి.. ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా టికెట్స్ అమ్మితే ఆ సొమ్ము అంతా నేరుగా ప్రభుత్వానికే అందుతుంది. అందులో నుండి తమ వంతు 24 శాతం మినహాయించుకుని, మిగిలిన సొమ్ముని ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ కి మేమే చెల్లిస్తాం అంటోంది ప్రభుత్వం.

లాభాలు:

Pavan Kalyan Sensational Comments on Movie Tickets - Suman TV

 •  రాష్ట్రంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే టికెట్స్ అమ్మాల్సి ఉంటుంది.
 •  రోజుకి నాలుగు షోలకి మించి పర్మిషన్ ఉండదు. అంటే.. ఫ్యాన్స్ షోలు, ఎక్స్ట్రా షోలకి ఛాన్స్ ఉండదు.
 • రూపాయితో సహా ప్రభుత్వానికి ట్యాక్స్ లు కరెక్ట్ గా అందుతాయి.
 •  నిర్మాతలకి కూడా కలెక్షన్స్ విషయంలో నిజాలు తెలుస్తాయి. ఎగ్జిబిటర్స్, బయ్యర్స్ నుండి సరైన కలెక్షన్ అందుతుంది.
 • ప్రజల జేబుకి అయితే.. చిల్లు పడే సమస్యే ఉండదు.

పవన్ కళ్యాణ్ వాదన:

Pavan Kalyan Sensational Comments on Movie Tickets - Suman TV

 • సినిమా తీసేది మేము, నటించేది మేము, వాటిని ఆడించేది మేము.. దాని మీద మీ పెత్తనం ఏమిటి అనేది పవన్ కళ్యాణ్ వాదన.
 • ప్రభుత్వ పోర్టల్ ద్వారా టికెట్స్ అమ్మితే డబ్భు అంతా నేరుగా ప్రభుత్వానికే వెళ్తుంది. వాళ్ళు ట్యాక్స్ మిహాయించుకుని, మిగిలిన భాగాన్ని ఎగ్జిబిటర్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ పే మెంట్ లేట్ అయితే? కాంట్రాక్టర్స్ తమ డబ్బు కోసం సంవత్సరాల పాటు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్టు.. సినిమా వాళ్ళు కూడా ప్రభుత్వం చుట్టూ తిరగాల?
 • సినిమా నిర్మాణ విలువ పెరిగిపోయింది. అన్ని సినిమాలకి ఒకటే టికెట్ రేటు ఉంటే పెద్ద సినిమాలు ఎలా సస్టైన్ అవ్వాలి? వందల కోట్ల పెట్టుబడి తిరిగి రావాలంటే.. టికెట్స్ రేట్స్ ఆ బడ్జెట్ కి తగ్గట్టు పెంచుకోవాలి కదా?
 • స్టార్ హీరోల సినిమాలను బతికించేది ఓపెనింగ్స్ మాత్రమే. ఆ మొదటి నాలుగు రోజుల్లో టికెట్స్ రేట్ల పై, నెంబర్ ఆఫ్ షోలపై నిబంధనలు విధిస్తే పెద్ద సినిమాలు నిర్మించడం ఎలా?
 • ఒక్కో స్టార్ హీరో ప్రభుత్వానికి వందల కోట్ల ట్యాక్స్ కడుతున్నాము. మాలాంటి నుండి ప్రొడక్షన్ ఆగిపోతే.. ఇండస్ట్రీ నుండి ప్రభుత్వానికి ఈ మాత్రం ట్యాక్స్ కూడా రావు కదా?
 • అసలు మొత్తం థియేటర్స్ మీద లాభాన్ని చూపి.. ప్రభుత్వం బ్యాంక్స్ నుండి వేల కోట్ల రూపాయలు అప్పుగా పొందాలని ప్రయత్నం చేస్తుందా? అలా జరిగితే ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి?

లాభాలు:

Pavan Kalyan Sensational Comments on Movie Tickets - Suman TV

 • పవన్ కళ్యాణ్ వాదన ప్రకారం చూస్తే.. ఇండస్ట్రీకి ఒక ఫ్రీ హ్యాండ్ లభిస్తుంది.
 • ప్రొడక్షన్ కాస్ట్ ని బట్టి.., టికెట్ రేటు నిర్ణయించుకునే స్వేచ్ఛ మేకర్స్ కి అందుతుంది.
 • ట్యాక్స్ మిహాయింపు పోగా, మిగిలిన డబ్బు కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ మేకర్స్ తిరగాల్సిన అవసరం ఉండదు.
 • ఇక్కడ సాధారణ ప్రజలకి, ప్రేక్షకులకి ఇలాంటి లాభం ఉండదు. కానీ.., సినిమా ఇండస్ట్రీ మాత్రం ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటుంది.

సమస్యకి పరిష్కారం: 

Pavan Kalyan Sensational Comments on Movie Tickets - Suman TV

ఈ సమస్య పరిష్కారం కోసమే చిరంజీవి లాంటి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సెట్ కావాల్సిందల్లా టికెట్ రేటు మాత్రమే. అందరికీ అమోగ్యం అయ్యే రెట్లని నిర్ణయించి, పోర్టల్ లోనే టికెట్స్ అమ్మమని పెద్ద నిర్మాతలు సైతం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఆ రేటు ఎంత అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రేటు పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్దంగానే ఉన్నా, అది ప్రజలకి భారం కాకూడదు అన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ టికెట్ రేటు గనుక ఒక్కసారి సెట్ అయితే, దీనికి ఇండస్ట్రీ పెద్దలు ఆమోదం తెలిపితే ఈ మొత్తం సమస్యకి ఒక సొల్యూషన్ వచ్చేసినట్టే. మరి.. ఈ మొత్తం అంశంలో ఎవరి వాదన కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.