పవన్ కళ్యాణ్, పేర్ని నాని ట్విట్స్ యుద్దం!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనలోని ఆవేదనను, ఆగ్రహాన్ని అంతా కక్కేశారు. ‘సాయితేజ్’ ప్రమాదంపై మీడియా చేసిన అతి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. కేవలం తన వల్ల సినీ పరిశ్రమను టార్గెట్ చేసి విధానం.. ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయం పై సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో మంత్రి పేర్ని నానిని సన్నాసి అంటూ సంబోధించడం ఆయనపై సెటైర్లు వేయడం జరిగింది.

kagae minఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని అదేస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. ‘లవ్ స్టోరీ’ సినిమాకు ఏపీలోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అన్నారు. ఈ సినిమా ఆంధ్రలో మంచి వసూళ్లు సాధించి ప్రొడ్యూసర్లు లాభాల బాట పట్టారు. మరి సిని పరిశ్రమకు ఏ విధంగా ఇబ్బంది పెట్టామో చెప్పాలని నాని తెలిపారు. పవన్ కళ్యాన్ నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుందని.. ఆయన అంటున్న మాటల్లో ఏ ఒక్కటైనా నిరూపించగలడా.. ఆ యుద్ధ వీరుడు, యోధుడు అంటూ సెటైర్లు వేశారు. అయితే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్  ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.., వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’అంటూ ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

అయితే దీనిపై మంత్రి పేర్ని నాని కూడా తనదైన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేస్తూ పవన్‌పై ఓ ట్రోలింగ్ వీడియోను షేర్ చేశారు. మొత్తానికి పవన్ వర్సెస్ పేర్ని నాని మద్య జరుగుతున్న ట్విట్స్, మాటల యుద్దం ఎప్పటికి పులిస్టాప్ పడుతుందో చూడాలి.