Eluru: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు నిండిపోయాయి. వాటిపై ఉన్న బ్రిడ్జిలపైనుంచి పొంగిపొర్లు తున్నాయి. కొన్ని చోట్ల ఈ పరిస్థితి దారుణంగా ఉంది. వరద నీరు బ్రిడ్జిలపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై వాగు దాటటానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ధైర్యం చేసి అటుఇటు వరదలోనే రోడ్డు దాటుతున్నారు. మరి కొంతమంది వాగు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
తాజాగా, ఏలూరు జిల్లాలో ఓ వృద్ధుడు వాగు దాటుతూ గల్లంతయ్యాడు. అనంతరం స్థానికుల పుణ్యమా అని బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వర్షాల కారణంగా ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కన్నాపురంలోని తూర్పు కాలువ పొంగి పొర్లుతోంది. వాగుపై ఉన్న బ్రిడ్జిపై నుంచి కూడా నీరు ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ఇలాంటి టైంలో వాగు దాటటం ప్రమాదం అని తెలిసినా ఓ వృద్ధుడు సాహసం చేశాడు.
ధైర్యంగా వాగు దాటటానికి ప్రయత్నించాడు. సగం మధ్యలోకి చేరుకోగానే ఉధృతికి పట్టు తప్పాడు. నీటిలో పడి కొట్టుకుపోయాడు. అయితే, అతడ్ని స్థానికులు ఎంతో కష్టం మీద కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, వాగు దాటటానికి వృద్ధుడు చేసిన సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: KA Paul: అధికారం ఇవ్వండి.. రూ.60 వేల కోట్లతో ఏపీని అభివృధ్ది చేస్తా: కేఏ పాల్