Kavali: రెక్కాడితే కానీ, డొక్కాడని కుటుంబం వారిది. ఓ పూట తినో.. ఓ పూట తినకో.. తమకంటూ ఉండటానికి ఓ సొంతిళ్లు ఉందన్న ధీమాతో బతుకుతున్నారు. ఆ ఇంటిపై రౌడీ మూకల కన్ను పడింది. పేద బతుకులపై దౌర్జన్యం మొదలుపెట్టాయి. ఆ ఇంటిని ఆక్రమించుకోవటానికి హింసించాయి.. దాడికి దిగాయి. దాడిలో గాయపడి, బాధితులు ఆసుపత్రి పాలైన సమయంలో ఇంటిని ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఓను ఆశ్రయించిన బాధిత కుటుంబం ఆయన కాళ్లపై పడి తమ బాధను చెప్పుకుంది. కన్నీళ్లతో సహాయం కోసం వేడుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో యానాది కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. నిరుపేదలైన వీరికి ఇళ్లే కొండంత అండ. ఈ ఇళ్లు ఉన్న స్థలాలపై రౌడీ మూకల కన్ను పడింది. వాటిని ఆక్రమించుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. యానాది కుటుంబాల వారిపై దాడికి దిగాయి.
ఈ దాడిలో గాయపడ్డ వారు చికిత్సకోసం ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చే సరికి ఘోరం జరిగిపోయింది. రౌడీ మూకలు ఇళ్లు ఆక్రమించుకున్నాయి. దీంతో యానాది కుటుంబాల వారు నిలువ నీడ కూడా లేని పరిస్థితిలో ఆర్డీవోను ఆశ్రయించారు. సోమవారం రౌడీ మూకల ఆగడాలకు వ్యతిరేకంగా ఆర్డీవో కార్యాలయం ముందు గిరిజన, యానాది సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ కుటుంబసభ్యులు చాంబర్‌నుంచి బయటకు వచ్చిన ఆర్డీవో శీనానాయక్‌ను చుట్టుముట్టారు. ఆయన కాళ్లపై పడ్డారు. ‘‘ మీ కాళ్లు పట్టుకుంటామయ్యా..మేం పేదలం. కనకరించి మా గూడు చెదరకుండా చూడండయ్యా’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకున్నారు. వారి కన్నీళ్లు చూసి చలించిపోయిన ఆర్డీవో సత్వరం విచారణ చేయించి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గోదారోళ్ల మజాకా.. కాబోయే కోడలికి ఏకంగా 100 రకాల స్వీట్లతో సారె!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.