ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి ఆహారం అందించేందుకు ఇస్కాన్‌కు చెందిన అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆధునిక వంటశాలను సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రూ.20కోట్లతో అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ ఏర్పాటు చేసింది. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడే తయారు చేస్తున్నారు.
ఇది చదవండి: కోర్టు సంచలన తీర్పు.. 38 మందికి మరణశిక్ష..!
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడినుంచే సరఫరా అవుతుంది. ఇందుకుగానూ, అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసింది. కేవలం 2 గంటల్లోనే 50వేల మందికి ఆహారం సిద్ధం చేసేలా దీన్ని నిర్మించారు. వంటశాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన కూడా వంటకాలను రుచి చూశారు.
పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న భోజనవివరాలను.. సీఎంకు వివరించారు అక్షయపాత్ర ప్రతినిధులు. సీఎం అక్కడి నుంచి కొలనుకొండ వెళ్లి.. ఇస్కాన్ నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. రూ.70 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. రాధాకృష్ణులు, వెంకటేశ్వరస్వామి ఆలయాలను అందులో నిర్మిస్తున్నారు. వాటితో పాటు ధ్యాన మందిరాలు, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
అక్షయపాత్ర వంటశాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్
విజువల్స్ #CMYSJagan https://t.co/2YpZe1vFqG pic.twitter.com/qnwlwZzajb— YSR Congress Party (@YSRCParty) February 18, 2022