ఒమిక్రాన్ టెన్షన్.. ఏపీలో నైట్ కర్ఫ్యూ మార్గదర్శకాలు విడుదల

Night Cerfew in AP

దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రజల్లో థర్డ్ వేవ్ భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా నిబంధనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ విధించాయి.

Night Cerfew in AP

తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నైట్  నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సంక్రాంతి తర్వాత నుంచి ఈ నైట్‌ కర్ఫ్యూ అమలులోకి రానుంది. అంటే 18 వ తారీఖు నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి దృష్ట్యా పెద్దఎత్తున ఊర్లకు వస్తుంటారు కాబట్టి.. కర్ఫ్యూ అమలు చేయడం కష్టంగా మారుతుందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నైట్‌ కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, మీడియా, టెలీ కమ్యూనికేషన్‌, ఐటీ, విద్యుత్‌, పెట్రోలు బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది.

రాష్ట్ర ప్రజలు అందరూ మాస్కులు ధరించేలా చూడాలని.. మాస్కు ధరించని వారికి జరిమానాలు విధించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సినిమా థియేటర్లను 50 సామర్థ్యంతోనే నడపాలని తెలిపారు. సీటు మార్చి సీటుకు అనుతివ్వాలని తెలిపారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించాలా చూడాలన్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, మాల్స్‌ లో కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశించారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్‌ ఈవెంట్స్‌ లో వందమందికి మాత్రమే అనుమతివ్వాలన్నారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.