వాహనదారులకు షాక్.. మరోసారి భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

petrol bike

వాహనదారులకు మరో షాక్ తగిలింది. వరుసగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సామన్యులు నలిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలకు పెంచి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వాహనదారులు నెత్తిని బాదుకుంటున్నారు. పెరిగిన ధరలను చూసుకున్నట్లైతే.. లీటర్ పెట్రోల్ పై రూ. 31 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెంచారు.

ఇక మొత్తానికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర చూస్తే గనుక రూ.107.77 చేరగా, డీజిల్ పై రూ. 101.74 పెరిగింది. ఇక ఇతర నగరాల్లో పెరిగిన పెట్రోల్ రేట్లను పరిశిలీస్తే విజయవాడ రూ. 109.70, చెన్నై రూ.101.01, ఢిల్లీ రూ.103.54, ముంబాయి రూ.109.54 గా పెరిగాయి. దీంతో మరోసారి భారీగా ఇంధన రేట్లు ఆకాశనంటడంతో సామాన్యులు బోదిబోమంటున్నారు. ఇలా ఇంధన ధరలను పెంచుకుంటుపోతున్న ప్రభుత్వం తీరుపై సామన్య జనాలు మండిపడుతున్నారు.