ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసని తుపానుతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అసని తుపాను కాస్త బలహీన పడినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. మొదట మచిలీపట్నం వద్ద తీరందాటుతుంది అని భావించినా ఆ తర్వాత శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కకుండా దిశ మార్చుకుని నర్సాపురం వైపు తీరందాటేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే తుపాను అనగానే సోషల్ మీడియాలో మొత్తం ఫొటోలు, వీడియోలతో హోరెత్తిస్తుంటారు.
ఇదీ చదవండి: అసనీ తుఫాన్ ఎఫెక్ట్.. తీరానికి కొట్టుకు వచ్చిన బంగారు మందిరం!
కొందరు ప్రస్తుతం జరుగుతున్న దృశ్యాలు పోస్ట్ చేసి అప్రమత్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఎప్పటివో వీడియోలు పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్రతీరం వెంబడి దట్టంగా కమ్ముకున్న మేఘాలు చూపరులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆకాశం, సముద్రం ఏకం అయిన విధంగా ఆ దృశ్యాలు ఉన్నాయి. ఎంతో ఆహ్లాదంగా ఉంది కదూ అంటూ చాలా మంది ఈ వీడియో పోస్ట్ చేస్తున్నారు. కానీ, నిజానికి అది ఇప్పటి వీడియో కాదు, అసలు మచిలీపట్నానికి ఆ వీడియోకి సంబంధం కూడా లేదు. నిజానికి ఆ వీడియో 2021లో శ్రీకాకుళం జిల్లా, కళింగపట్నం తీరప్రాంతంలో తీసింది అని తెలుస్తోంది. కాబట్టి నిజం ఏంటి అనేది తెలియకుండా వీడియోలు వైరల్ చేయకండి అంటు నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nature got mood swings
A short video of its ‘Asani’ 🥺 #Visakhapatnam #Asani #Cyclone pic.twitter.com/HKMW2FqGhB— Deepika💙 (@D_e_e_p_i_k_A__) May 10, 2022
This is not #CycloneAsani. This Video i have posted in my Instagram on June 21st 2021. Location – Kalingapatnam, Srikakulam pic.twitter.com/ig6dYkxE2k
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) May 11, 2022