తిరుపతిని వణికిస్తున్న వరదలు.. కొట్టుకుపోయిన ఇల్లు..

Tirupathi Heavy Rain Floods - Suman TV

తిరుపతిని భారీ వరదలు వణికిస్తున్నాయి. తిరుమల, తిరుపతి మొత్తం ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకు బతుకుతున్నారు. తిరుపతి నగరంలో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. నగరం మొత్తం దాదాపు అన్ని కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. చాలా చోట్ల వర్షం నీరు ఇళ్లలోకి చేరాయి. తాజా దృశ్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తిరుపతి వసుంధరా కాలనీలో ఇల్లు ఒకటి వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.