‘పుష్ప’ ను వేధిస్తున్న లీకులు.. నెట్లో మరో వీడియో

Allu Arjun Pushpa Another Leaked Video Viral - Suman TV

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అప్‌ కమింగ్‌ మూవీ ‘పుష్ప’ సినిమాకు లీకుల బాధ తప్పడం లేదు. ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదల సమయంలో ఓ వీడియో బయటకొచ్చి కేసుల వరకూ వెళ్లింది. తాజాగా మరోసారి ఈ సినిమా చిత్రీకరణ ఫుటేజ్‌ బయటకొచ్చింది. కాకినాడ పోర్టులో జరుగుతున్న షూటింగ్‌ సన్నివేశాలు మంగళవారం బయటికొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫుటేజ్‌ బయటకు రావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది. వీడియో బయటకు ఎలా వచ్చిందో అర్థంకాక యూనిట్‌ తలపట్టుకుంటోంది. దీనిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు చిత్ర బృందం సిద్దమైనట్లు సమాచారం.

Allu Arjun Pushpa Another Leaked Video Viral - Suman TV