సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన అల్లు అర్జున్ కూతురు!

Alluarjun

అల్లు అర్జున్ కూతురు, గారాల పట్టి అల్లు అర్హ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తూ అందరిని మైమరిపిస్తోంది. అయితే తాజాగా అల్లు అర్హ చిన్న వయసులోనే ఏకంగా 50 మందికి చెస్‌లో శిక్ష‌ణ‌ను ఇస్తూ నోబుల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాదించింది. తాజాగా నోబుల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ అవార్డును ప్ర‌తినిధులు అల్లు అర్హకు అందించారు.

ఇక అసలు విషయం ఏంటంటే..? గతంలో అల్లు అర్హకు ఓ చెస్ అకాడమీలో లో శిక్షణ ఇప్పించారట. అలా నేర్చుకుంటూ అందులో కాస్త అరి తేరింది. ఇదిలా ఉంటే చిన్న వయసులోనే నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు శిక్షణ కూడా ఇచ్చింది. విన్నటానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఒకరికి కాదు ఇద్దరికి కాదు అలా రెండు నెలల్లో ఏకంగా 50 మందికి శిక్షణ ఇవ్వటం విశేషం.

ఈ విషయం తెలుసుకున్న నోబుల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ ప్రతినిధులు అల్లు అర్హకు ఓ టెస్ట్ పెట్టారు. అందులో అల్లు అర్జున్ కూతురు అర్హ సత్తా చాటడంతో ఆశ్చర్యపోయిన ప్రతినిధులు నోబుల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ అవార్డును అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు వారి కుటుంబ సభ్యులు సంతోషంతో ఉబ్బితబ్బిపోతున్నారు. తాజాగా అల్లు అర్హకు అందించిన అవార్డు ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.