పెళ్లైతే ఎంటీ.. తగ్గేదే లేదు అంటూ.. భర్తతో అర్ధ నగ్నంగా సమీరా

ఫిల్మ్ డెస్క్- సమీరా రెడ్డి.. ఈ బాలీవుడ్ అందగత్తే ఒకప్పుడు తెలుగు సినిమాలతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలు బాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ సరసన నటించింది. 2013లో వరదనాయక కన్నడ మూవీలో నటించిన తర్వాత సమీరా రెడ్డి అనివార్య కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక 2014 లో మహారాష్ట్రకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్ధేని పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

సమీరా రెడ్డి, అక్షయ్ దంపతులకు ప్రస్తుతం ఓ కొడుకు, కూతురు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నా, ఎప్పుడూ సమీరా సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. ఎఫ్పటికప్పుడు తన కుటుంబానికి సంబందించి విషయాలతో పాటు, ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక అప్పుడప్పుడు తన గ్లామర్ పిక్స్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందనుకొండి.

sameera reddy 2 jpg

సమీరా రెడ్డి తాజాగా తన భర్త అక్షయ్, పిల్లలతో కలిసి గోవా బీచ్ లో ఎంజాయ్ చేసింది. మామూలుగా ఎంజాయ్ చేస్తే మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ సమీరా రెడ్డి ఏకంగా బికినీలో కనిపించింది. దాదాపు అర్ధ నగ్నంగా ఉన్న సమీరా రెడ్డి, భర్త పిల్లలతో కేరింతలు కొట్టింది. పెళ్ళయినప్పటికీ తాను అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటూ కవ్విస్తోంది. ప్రస్తుతం సమీరా బికీనీ ఫోటోస్ ఇన్ స్టా గ్రామ్ ను వేడెక్కిస్తున్నాయి.

సమీరా రెడ్డితో పాటు ఆమె భర్త కూడా అర్ధ నగ్నంగా కనిపించారు. వైట్ అండ్ బ్లాక్ స్ట్రాప్స్ తో కూడిన బికినీలో భలే పోజులిచ్చింది. గోవా బీచ్ లో రెండు రోజుల పాటు ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. మరి మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆలోచనతోనే ఇలా చలరేగిపోతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సమీరా రెడ్డి నిజంగానే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.