మూడు పెళ్ళిళ్ళూ పెటాకులైనా జీవితానికి ఎదురీదిన వనిత!..

దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్ ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరవాత మళ్లీ మరో తెలుగు సినిమాలో వనిత నటించలేదు. కానీ, ఆ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె పేరు మారుమోగింది. దీనికి కారణం ఆమె మూడో పెళ్లి. లాక్‌డౌన్ సమయంలో పీటర్ అనే ఫిలిం మేకర్‌ను ఆమె మూడో పెళ్లి చేసుకోవడం.. దీనిపై పీటర్ భార్య గొడవ చేయడం.. పీటర్‌తో వనితకు కొన్ని రోజుల్లోనే విభేదాలు తలెత్తడం.. వాళ్లు విడిపోవడం జరిగిపోయాయి. దేవి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చివ‌రికి అన్నిటిని ఎదుర్కొని చిత్ర‌ప‌రిశ్ర‌మలోనూ, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ గ‌ట్టిగా నిలిచారు. చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. వాటిని దీటుగా తిప్పికొట్టారు.

76440010 1

తమిళ బిగ్ బాస్ షో పాల్గొనడం ద్వారా తన పాపులారిటీని బాగా పెంచుకున్న వనిత మూడో పెళ్లి చేసుకుని వెంటనే విడిపోయి నవ్వుల పాలు అయ్యారు. అయితే, తాను వరుస పెళ్లిళ్లు చేసుకోవడం.. వెంటనే మళ్లీ విడిపోవడం ఎందుకు జరుగుతోందో వనిత వివరించారు. తన పెళ్లిళ్లపై ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్లపై, తల్లిదండ్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వైవాహిక జీవితం సరిగా సాగకపోవడానికి తల్లిదండ్రులదే బాధ్యత అని ఆరోపించారు వనిత. అంతేకాదు, తన ఇష్యూలోకి చిరంజీవి, రజినీకాంత్‌ను కూడా తీసుకొచ్చారు. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వ‌నిత వ్యక్తిగ‌త జీవితం గురించి చెప్పిన అంశాలు వైర‌ల్ అయ్యాయి. వనితా విజయ్‌కుమార్‌పై సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరో మహిళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఆమెకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. వాటన్నింటికీ గట్టిగా కౌంటర్ ఇచ్చిన వనిత న్యాయపరంగా తాను చూసుకుంటానని చెప్పారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి మూడు నెలలకే పెటాకులైనట్లు తెలుస్తోంది. వనిత తన మూడో భర్తను తన్ని ఇంట్లో నుంచి తరిమేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో వెల్లడించారు.  వనిత మూడో వివాహంపై రవీందర్ తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కారు. భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని అక్రమంగా పెళ్లి చేసుకోవడం తప్పని అన్నారు. ఆయన కామెంట్లపై వనిత కూడా గట్టిగానే స్పందించారు. తన జీవితం గురించి మాట్లాడేవారెవ్వరూ తనకు సాయం చేయరని, ఉన్నపళంగా రూ.40 వేలు అవసరముందని అడిగితే ఎవ్వరూ ఇవ్వరని కౌంటర్ వేసింది. త‌ల్లిదండ్రుల‌తో పాటు చెల్లెళ్లు, త‌మ్ముడు కూడా త‌న‌ను దూరం పెట్టార‌ని వాపోయారు. మూడో పెళ్లి విషయంతో తాను తప్పటడుగు వేశానని వనిత అంగీకరించారు. అసలు పీటర్‌తో తనకు జరిగింది పెళ్లే కాదని అన్నారు. తన తండ్రిని విలన్‌తో పోల్చారామె. అంతేకాదు, తన తల్లి మంజులను కూడా ఆర్థికంగా మోసం చేశారని ఆరోపించారు. సోషల్‌మీడియాల్లో త‌న‌ను కుటుంబ స‌భ్యులు బ్లాక్‌ చేశారని తెలిపారామె. దేవుడి దయ వల్లే తాను ఈ స్థాయికి రాగలిగిన‌ట్టు చెప్పారు. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్లే ఎన్నో విషయాలు తెలుసుకోగలిగిన‌ట్టు వనిత చెప్పారు. సినిమాల కంటే వ్య‌క్తిగ‌త జీవిత‌మే వ‌నిత‌ను హైలెట్‌గా నిలిపింది. ఇటీవ‌ల సినిమాల్లో కూడా ఆమె బిజీగా ఉంటున్నారు.