కొత్త ఔషదాన్ని మార్కెట్లోకి తెచ్చిన  గ్లేన్‌మార్క్ ఫార్మా

Glenmark
glenmark covid medicine
f4527994578503.5e8289fd07c62
GLENMARK COVID MEDICINE

స్పెషల్ డెస్క్- కరోనా మహమ్మారి విజృంబిస్తున్న క్లిష్ట సమయంలో ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లేన్‌మార్క్ శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా 50 మిల్లీ గ్రాముల మొమెటాసోన్ ఫురోయేట్, 140 మిల్లీ గ్రాముల అజెలాస్టైన్ ఔషధాలను కలగలిపి రయాల్ట్రిస్-ఏజెడ్ పేరుతో ఫిక్స్డ్‌ డోస్ కాంబినేషన్ ఔషధాన్ని తయారు చేసింది. ఈ సరికొత్త ఔషదాన్ని  గ్లేన్‌మార్క్ తాజాగా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రైనైటిస్ అలర్జీ, ముక్కులో దిబ్బెడ, దురద, తుమ్ములు వంటి సమస్యలకు ఈ ఔషధంతో పరిష్కారం లభిస్తుందని కంపెనీ ఓ ప్రకటలో పేర్కొంది. అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం 175 రూపాయలకే ఈ ఔషదాన్ని మార్కెట్‌లో లాంచ్ చేశామని  గ్లేన్‌మార్క్ స్పష్టం చేసింది.

ఇతర బ్రాండ్లతో పోలిస్తే తమ ఔషధం ధర ఏకంగా 52 శాతం తక్కువని కంపెనీ చెబుతోంది. కరోనా ప్రాధమిక లక్షణాలను ఈ ఔషధంతో తొందరగా నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐతే వైద్య నిపుణుల సలహా లేనిదే ఈ మందులను నేరుగా వాడకూడదని చెబుతున్నారు.