బాలకృష్ణకి బర్త్ డే విషెస్ చెప్పిన స్టార్ క్రికెటర్!

నందమూరి బాలకృష్ణ.. తెలుగు చలనచిత్ర రంగంలో ఈ పేరు ఒక సంచలనం. నటుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో బాలయ్య చూడని విజయాలు లేవు. ఆయన అందుకొని రికార్డ్స్ లేవు. తెలుగు తెరపై నటసింహం అయినా ఆయనే. సీమ సింహం అయినా ఆయనే. ఇందుకే బాలయ్యకి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంది . ఇక ఈ జూన్ 10వ తేదీతో నందమూరి బాలకృష్ణ 61 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బాలయ్యకి సినీ పరిశ్రమ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా కురిశాయి. ఇక బాలయ్య పొలిటిషియన్ కూడా కావడంతో.., రాజకీయ వర్గాల నుండి ఆయనకి శుభాకాంక్షలు అందాయి. దీంతో.., బాలయ్య పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.

ఇంతవరకు అంతా ఊహించిందే. బాలయ్య లాంటి సీనియర్ హీరో పుట్టినరోజుకి అభిమానుల నుండి, ఇండస్ట్రీ పీపుల్ నుండి ఆ మాత్రం రెస్పాన్స్ లేకుండా ఎలా ఉంటుంది? కానీ.., ఇండియన్ మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ బాలయ్య పుట్టినరోజుని గుర్తు పెట్టుకుని.., ఆయనకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకంక్షలు అందించడం ఇప్పుడు వైరల్ గా మారింది. “నందమూరి బాలకృష్ణ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వినోదాత్మక సినిమాలతో, మానవతా కార్యకలాపాలతో ప్రపంచాన్ని ఇలానే ప్రేరేపించాలని కోరుకుంటున్నట్లు యువరాజ్ సింగ్ విషెస్ అందించాడు. అలాగే 2015లో బాలకృష్ణతో దిగిన ఫొటోను కూడా యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.

balaya 2బాలయ్యతో యువీకి ఇంతటి క్లోజ్ రిలేషన్ ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో యువరాజ్ క్యాన్సర్ కి గురి అయ్యాడు. కానీ.., ఆ సమయంలో తన ప్రాణాలకి సైతం తెగించి, దేశానికి వరల్డ్ కప్ అందించి హీరో అయ్యాడు. తరువాత యువీ క్యాన్సర్ బారి నుండి బయటపడ్డాడు. ఆ సమయంలో యువరాజ్ క్యాన్సర్ బాధితుల కష్టాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు. వారి కోసం ఏమైనా సేవా కార్యక్రమాలు చేయాలని ముందుకి వచ్చాడు. ఆలా “యువీ కెన్” అనే సంస్థని ఆన్లైన్ వేదికగా స్థాపించాడు.

ఆ ప్రాసెస్ లో బసవతారకం హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ పేషంట్స్ అందిస్తున్న సహాయాన్ని తెలుసుకుని యువరాజ్ మంత్ర ముగ్దుడైపోయాడు. వెంటనే బాలయ్యతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యాడు యువి . అలా యువరాజ్-బాలకృష్ణ కలయిక జరిగింది. ఇప్పటికీ వీరు క్యాన్సర్ పేషంట్స్ కలసి సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇలా ఓ మంచి పనికోసం కలసిన ఇద్దరు మంచి మనుషుల మధ్య ఓ మంచి బాండింగ్ ఏర్పడటం మంచి విషయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., ఇంటర్నేషనల్ స్టార్ అయిన యువరాజ్ సింగ్ మన బాలయ్య బాబుకి బర్త్ డే విషెస్ అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.