పెళ్లి పీటలెక్కనున్న హీరో రాజ్ తరుణ్! అమ్మాయి ఎవరో తెలుసా?

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో పెళ్లి కాని ప్రసాద్ లు చాలా మందే ఉండేవారు. కానీ.., ఫస్ట్ వేవ్ సమయంలో వచ్చిన లాక్ డౌన్ ని వీరంతా పెళ్లిళ్ల సీజన్ గా మార్చేసుకుని ఓ ఇంటి వారైపోయారు. కానీ.., కొంతమంది హీరోలు మాత్రం ఇంకా బ్యాచిలర్స్ గానే మిగిలిపోయారు. వీరిలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే.., ఇప్పుడు ఈ యువ కథానాయకుడు కూడా పెళ్లి పీటలెక్కడానికి సిద్దమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా రాజ్ తరుణ్ కెరీర్ మొదలైంది. అలా వచ్చిన క్రేజ్ తో ఉయ్యాల జంపాల సినిమాతో హీరో అయిపోయాడు. తరువాత కాలంలో సినిమా చూపిస్తా మామ, కుమారి 21F వంటి సినిమాలతో రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పెరిగింది. ఒకానొక సమయంలో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ.., తరువాత కాలంలో మాత్రం రాజ్ సక్సెస్ వేటలో వెనుక పడిపోయాడు. ఈ హీరోకి హిట్ వచ్చి ఏళ్ళు గడిచిపోతుందంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

raj 2రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘స్టాండప్ రాహుల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ‘కూర్చుంది చాలు’ అనేది ఉపశీర్షిక. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. సిద్ధు ముద్ద సమర్పణలో నంద్ కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తరువాత కూడా రాజ్ తరుణ్ చేతిలో భారీగానే పాజెక్ట్స్ ఉన్నాయి. కానీ.., సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు. ఇలా రీల్ లైఫ్ టెన్షన్స్ దాటాలంటే.. రియల్ లైఫ్ లో సెటిల్ అవ్వడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చాడట రాజ్ తరుణ్. దీంతో.. ఈ హీరో తన చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని ఇరువురు తమ కుటుంబ పెద్దలకి చెప్పి, వారిని పెళ్ళికి ఒప్పించినట్టు తెలుస్తోంది. రాజ్ తరుణ్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయినట్టు సమాచారం. దీంతో.., పెళ్లి కూడా త్వరలోనే జరిగిపోనుందట. ముందుగా నిశ్చితార్థం చేసుకుని, అనంతరం ఈ ఏడాది చివరలో లేదా 2022 స్టార్టింగ్ లో గాని పెళ్లికి ముహూర్తం సెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. రియల్ లైఫ్ లో సెటిల్ కాబోతున్న రాజ్ తరుణ్ కి కామెంట్స్ రూపంలో మీ విషెస్ తెలియచేయండి.