నీ వాయిస్‌ లేస్తే నా గొంతు లేవదా? జెస్సీపై యానీ మాస్టర్ ఫైర్!

తెలుగు బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడవ రోజే హీట్ వాతావరణంతో కొనసాగింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌజ్ కిట కిటలాడుతుంది. అయితే మొదటి వారం నామినేషన్ ఎవరు అన్న విషయం పై అప్పుడే రగడ కొనసాగుతుంది. అప్పుడే గొడవలు, గిల్లి కజ్జాలు.. ఏడుపులు.. చాటు మాటు మాటల సీన్లతో ప్రేక్షకులను ఎంటర్‏టైన్‏ చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తున్నారు. ఇక నామినేషన్ ప్రాసెస్‏ ప్రక్రియతో హౌస్‏మేట్స్ మధ్య ఫిట్ంగ్స్ పెట్టాడు బిగ్ బాస్.

big bossఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇంట్లో ఎంతో అమాయకంగా కనిపించిన జెస్సీ (జశ్వంత్) నిన్నటి ఎపిసోడ్ లో అందరికీ షాక్ ఇచ్చాడు. రాత్రి సమయంలో జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకొని కూర్చున్నాడు. అక్కడకు వచ్చిన యానీ మాస్టర్ కుర్చీలో నుంచి కాలు తీయమని అడిగింది. కానీ మనోడు కాలు తీయనని మొండిగా సమాధానం చెప్పి ఆ కుర్చీపై మరో కాలు వేశాడు. దాంతో యానీ మాస్టర్ కి చిర్రెత్తుకొచ్చి కాస్త నిదానంగా.. మంచి పద్దతితో అడిగింది.. దానికి జెస్సీ ఒప్పుకోలేదు. ఓపిక నశించిన యానీ మాస్టర్ నాటకాలు వేయకంటూ జెస్సీపై ఫైర్ అయింది. నీ వాయిస్‌ లేస్తే నా గొంతు లేవదా? అని మండిపడుతుండగా.. జెస్సీ క్లాప్స్ కొడుతూ ఆమెకి మరింత కోపాన్ని తెప్పించాడు. వీరి మద్య జరుగుతున్న సంభాషణ శృతి మించి పోయే పరిస్థితి రావడంతో అందరూ అక్కడికి వచ్చి జెస్సీ, యానీ మాస్టర్ కి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.

యాంకర్ రవి అయితే ఆమె అనుభవం అంత వయసు నీకు లేదు అనడంతో.. ఆ ప్రస్థావన ఇక్కడ ఎందుకు అన్నారు యానీ మాస్టర్. ఈ విషయంలో హౌస్ మేట్స్ అంతా జెస్సీని తప్పుబట్టడంతో అతడు యానీ మాస్టర్ కి సారీ చెప్పాడు. కానీ అతను చెప్పే విధానంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండటంతో యానీకి మరింత కోపం వచ్చింది. ఈ విషయంలో లోబో.. జెస్సీకి సారీ ఎలా చెప్పాలో గీతోపదేశం చేశారు. ఆ తరువాత యానీ మాస్టర్ బెడ్ పై పడుకొని ఏడ్చేశారు. మరి వీరి మద్య ముందు ముందు ఎలాంటి వివాదాలు వస్తాయో.. లేక స్నేహితులుగా మారుతారో చూడాలి.