సాయిధరమ్ తేజ్ ని చాలాసార్లు హెచ్చరించా.. నటుడు నరేష్

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నిన్న రాత్రి బైక్‌పై ప్ర‌యాణిస్తున్న క్ర‌మంలో కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర కింద ప‌డి తీవ్ర గాయాల‌పాలైన విష‌యం తెలిసిందే. ప్రాథ‌మిక చికిత్స కోసం మెడికోవ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, అనంత‌రం అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ కు స్పోర్ట్స్ బైక్స్ అంటే ప్రాణం.

saig minసాయిధరమ్ తేజ్ కి ఎక్కువగా బయటకు వెళ్లాలంటే బైక్ పై వెళ్లడమే ఇష్టం. అందుకే తన గ్యారేజ్ లో నాలుగు స్పోర్ట్స్ బైక్ లు పెట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇందులో రెండు స్పోర్ట్స్ బైక్ లు గిఫ్టుగా వచ్చినవి. ఒకటి పవన్ కళ్యాణ్, మరొకటి సాయి ధరమ్ తేజ్ తల్లి తనకు గిఫ్ట్ గా ఇచ్చారు. మరో రెండు స్పోర్ట్స్ బైక్ లను సొంతంగా కొనుగోలు చేశాడు సాయి ధరమ్ తేజ్. శుక్రవారం రాత్రి 8 గంటలకు బైక్ పై వెళ్తున్న సాయిధరమ్ తేజ్ మాదాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు.

తాజాగా దీనిపై సీనియర్ నటుడు స్పందించారు. బైక్ రైడింగ్ పై సాయితేజ్ ను చాలా సార్లు హెచ్చరించానని ఆయన చెప్పారు. తేజ్, నా కుమారుడు ఇద్దరూ కలిసి రైడింగ్ చేస్తారని తెలిపారు. పరిస్థితులు బాగాలేవని.. వేగం అన్నింటికి అనార్ధం అని వారిద్దరికీ చాలాసార్లు నచ్చజెప్పానని అన్నారు. రైడింగ్ వల్ల ప్రమాదాలు జరిగితే కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడతారో తేజ్ కి నా కుమారుడికి చెప్పేవాడినని అన్నారు. నిన్న రాత్రి కూడా తన ఇంటి నుంచి సాయితేజ్ వెళ్లాడని తెలిపారు. సాయితేజ్ యాక్సిడెంట్ కు గురి కావడం బాధిస్తోందని… త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.