Vishal: తెలుగబ్బాయి అయినప్పటికి తమిళ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు విశాల్. ‘ప్రేమ చదరంగం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా, లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం ఘనంగా ‘లాఠీ’ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో ఉదయనిధి స్టాలిన్, డైరెక్టర్ ఎస్జే సూర్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు రోబో శంకర్ స్టేజిపై ఎక్కి విశాల్‌కు ఓ విన్నపం చేశారు. రోబో శంకర్ మాట్లాడుతూ.. ‘‘ విశాల్ సార్! నేను మీతో రెండు సినిమాలు చేశాను. అందరికీ ఫోన్ చేసి సినిమాల్లోకి తీసుకుంటారు. వాళ్లకు ఏం కావాలో అన్నీ అడిగి తెలుసుకుని చేస్తారు. నన్ను మాత్రం ఏదో పిలవాలంటే పిలవాలి అన్నట్లు పిలుస్తారు. అలా చేయకండి సార్’’ అని అన్నాడు. ఇంతలో విశాల్ కోపంగా రోబో శంకర్ చేతిలో మైకు లాక్కుని అతడ్ని కొట్టాడు. రోబో శంకర్ ఏదో మాట్లాడబోతే మరో సారి కొట్టాడు. అప్పుడు హాలులో ఉన్న వారంతా షాక్ తిన్నట్లు అయ్యారు. వీళ్ల గొడవ కారణంగా స్టేజిపై ఉన్న నటుడు సూరి కోపంగా అక్కడినుంచి కిందకు దిగి వెళ్లబోయాడు. అప్పుడు విశాల్ సూరిని వెనక్కి పిలుస్తూ నవ్వసాగాడు. ఇదంతా ప్రాంక్ అని తెలిసి హాలులో ఉన్న వారు కూడా నవ్వారు. కాగా, విశాల్ సినిమా షూటింగుల్లో చాలా జోవియల్‌గా ఉంటారు. రోబో శంకర్, సూరిలతో కలిసి అప్పుడప్పుడు ప్రాంకులు చేస్తుంటారు. ఆ విధంగానే స్టేజిపై ప్రాంక్ చేసి అందర్నీ షాక్‌కు గురిచేశారు. మరి, విశాల్, రోబో శంకర్ల ప్రాంక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Bandla Ganesh: పూరీ జగన్నాథ్ దంపతుల ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్! కారణం?