ఫ్లాష్ ఫ్లాష్ : షూటింగ్ లో విశాల్ కి తీవ్ర గాయాలు!!.

తెలుగువాడు అయినప్పటికీ  తమిళంలో స్టార్ హీరో స్థానం సంపాదించుకున్న హీరో విశాల్  ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. శరవణనన్ దర్శకుడు. హీరోగా విశాల్‌కు 31వ సినిమా. ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్‌తో పాటు పలువురు నటీనటులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. ఆకస్మాత్తుగా జరిగిన పరిణామానికి చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది.

Hero Vishal Injured 01 minఈ ప్రమాదంలో విశాల్వె న్నుపూసకు దెబ్బ తగిలింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూట్‌ జరుగుతోంది. డైరెక్టర్ శరవణన్ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎంతో ఎనర్జిటిక్‌గా సాగుతోన్న క్లైమాక్స్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లో విశాల్ బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారు. ఆయన వైద్యుల సమక్షంలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. విశాల్‌ ఆరోగ్యంగానే ఉన్నారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

విశాల్ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ ఆయన ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడు కృషి చేస్తూనే వచ్చారు. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం ‘యాక్షన్’ అనే భారీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రం అనే అనిపించింది. దీంతో విశాల్ మరోసారి తన కెరీర్‌పై దృష్టిని కేంద్రీకరంచారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేశారు.

ఇందుకోసం ‘విశాల్31’లో ఆయన స్వయంగా స్టంట్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.   యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. యువన్ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలోనూ షూట్‌లో తీవ్రంగా గాయపడ్డారు విశాల్‌. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.