యన్టీఆర్ సినిమాలో విజయశాంతి! పవర్ ఫుల్ రోల్ లో రాములమ్మ!

లేడీ సూపర్ స్టార్.. ఇలా పిలిపించుకోవాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. మన తెలుగు చలనచిత్ర రంగంలో ఒక్క విజయశాంతికి మాత్రమే ఈ ఘనత సొంతం అయ్యింది. ఓ దశాబ్దం పాటు.., ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలకి దీటుగా.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో ఫైట్స్ చేసి దుమ్ము రేపేసింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి.., వెండితెరకి దూరం అయ్యింది. కానీ.., ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చాక కూడా లేడీ సూపర్ స్టార్ రేంజ్ వేరేలా ఉంది. గ్యాప్ ఇచ్చినా సరే..టాప్ ప్రాజెక్టులే ఆమెను వరిస్తున్నాయి. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ హిట్ కొట్టిన విజయశాంతి ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక తరం హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ విజయశాంతి. అగ్రనటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జునతో నటించి హిట్ పెయిర్‌గా వెలిగిపోయింది. అలాంటి విజయశాంతి.. ఒసేయ్ రాములమ్మ వంటి బ్లాక్‌బస్టర హిట్లు వచ్చిన తర్వాత కూడా సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లింది. అలా 13 ఏళ్లు నటనకు దూరమైంది. చివరికి అనిల్ రావిపూడి ఆమెతో సరిలేరు నీకెవ్వరూ మూవీలో కీరోల్ చేయించి మళ్లీ గ్రాండ్ వెల్కమ్ ఇప్పించాడు. దీంతో మళ్లీ ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తాజాగా విజయశాంతి.. మరో భారీ ప్రాజెక్టును ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

v2జూనియర్ ఎన్టీఆర్- కొరటాల సినిమాపై ఇటీవలే ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. గతంలో వీరి కాంబినేషన్లో జనతా గ్యారెజ్ వచ్చి బంపర్ హిట్ కొట్టింది. అయితే ఈసారి లోకల్‌గా కాకుండా.. బౌండరీస్ దాటి మూవీ చేస్తున్నామని చెప్పిన కొరటాల.. భారీ అంచనాలు పెంచేశాడు. ప్రస్తుతం క్యాస్టింగ్ కూర్చే పనిలో నిమగ్నమైన కొరటాల.. సినిమాలో విజయశాంతిని ఓ మెయిన్ రోల్ కోసం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. జనతా గ్యారెజ్‌లో మోహన్‌లాల్ లాగా.. విజయశాంతి రోల్ ఈ సినిమాలో చాలా పవర్‌పుల్‌గా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. విజయశాంతి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల మంచి క్యారెక్టర్ డిజైన్ చేశారట. ఇక ఈ సినిమా కూడా మేసేజ్ ఒరియేంటెడ్గా వస్తోందట. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్, కొరటాల కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకే ఆ లోపు మెయిన్ క్యారెక్టర్లను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. గతంలో విజయశాంతి, బాలకృష్ణ మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. జాతకాలను, సెంటిమెంట్స్ ని బలంగా నమ్మే బాలయ్య.. ఒకానొక సమయంలో విజయశాంతిని తన లక్కీ హీరోయిన్ గా కూడా భావించారు. మరి ఆ రోజుల్లో బాబాయ్ కి లక్ ఫ్యాక్టర్ గా మారిన రాములమ్మ.. ఇప్పుడు అబ్బాయికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.