తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అల్లరిస్తోన్న టాప్ కామెడీ షోల్లో జబర్దస్త్ ఒకటి. ఇది బుల్లితెర చరిత్రలోనే ఓ సంచలనంగా నిలించింది. ఏళ్ల తరబడి విభిన్నమైన కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ షో ద్వారా అనేక మంది కమెడియన్స్ మంచి గుర్తింపు పొందారు. మరికొందరైతే ఏకంగా సినిమాలో హీరోలుగా, ఇతర కీలక పాత్రలో నటిస్తోన్నారు. అది అలా ఉంచితే అప్పుడప్పుడు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ షోలో నటించి.. తమదైన శైలిలో కామెడి పండిస్తున్నారు. అలా వచ్చిన వారిలో బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు ఒకరు. మొదట్లో ఓ ఈవెంట్ కి వచ్చి.. అక్కడ తనదైన మాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం మరికొన్ని స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ మరింత ఫేమస్ అయ్యారు. ఇక జబర్ధస్త్ లో సైతం రోహిణితో జత కడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అప్పారావు మిగిలిన కమెడియన్స్ కి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు. వారం వారం వచ్చే జబర్దస్త్ లో విభిన్నమైన గెటప్ లతో ఆయన అలరిస్తున్నారు. యంగ్ బాయ్ లా ఒకసారి, లవర్ బాయ్ గా మరోసారి.. ఇలా అనేక గెటప్ లో సందండి చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలలో చీరకట్టులో పల్సర్ బైక్ పాటకు బుల్లెట్ భాస్కర్ వాళ్ల నాన్న అప్పారావు అదిరిపోయే డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో.. పసుపు రంగు చీర కట్టుకున్న అప్పారావు...రోహిణితో కలసి పల్సర్ బైక్ పాటకు స్టెప్పులేశారు. అనంతరం పండు వచ్చి వెనుక నుంచి గట్టిగా కౌగిలించుకుంటాడు. వదలరా..బాబు... నేను ఆడదాన్ని కాదు..భాస్కర్ వాళ్ల బాబును అంటూ సమాధానం ఇస్తాడు. ఈక్రమంలో స్టేజిపైకి ఎంట్రి ఇచ్చిన బుల్లెట్ భాస్కర్ .. 'నాన్న నీ ముఖం అమ్మకు ఎలా చూపిస్తావు' అని అంటాడు. ఇలానే చూపిస్తానంటూ అప్పారావు అదిరిపోయే పంచ్ వేశాడు. దీంతో జడ్డీలుగా ఉన్న ఇంద్రజ, ఖుష్బు పగలపడి నవ్వుతారు. ఇంకా ఈ ప్రోమో చాలా కామెడీగా ఉంది. అయితే ఫుల్ ఫన్ కోసం పూర్తి ఏపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. మరి.. బుల్లెట్ భాస్కర్ వాళ్ల తండ్రి చీరకట్టులో చిందులు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ‘రాధే శ్యామ్’ డైరెక్టర్ తో రామ్ కొత్త సినిమా..? ఇదీ చదవండి: పెళ్లి కాకుండా తల్లి అయితే నన్ను ఎవరు ఆపుతారు?: టబు