జీవితంలో TNR తీసుకున్న 5 గొప్ప నిర్ణయాలు ఇవే!

TNR.. ప్రముఖ డిజిటిల్ మీడియాలో వచ్చే “ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్” కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన వ్యక్తి. తరువాత కాలంలో ఈయన ఇంటర్వ్యూకి హ్యుజ్ ఫ్యాన్ బేస్ సెట్ అయ్యింది. చాలా మంది ప్రేక్షకులకు టి.ఎన్.ఆర్ అంటే ఇంత వరకు మాత్రమే తెలుసు. కానీ.., టి.ఎన్.ఆర్ కూడా జీవితంలో చాలా కష్టాలు పడ్డారు. రాజీ లేని పోరాటం చేశారు. చివరికి ఇన్నేళ్ల తరువాత లైఫ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా కన్ను మూశారు. ఇలాంటి నేపధ్యంలో టి.ఎన్.ఆర్ తన మొత్తం జీవితంలో తీసుకున్న 5 మంచి నిర్ణయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1) టి.ఎన్.ఆర్ ముందుగా తెలుగు మీడియాలో సాధారణ పోగ్రామ్ ప్రొడ్యూసర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కానీ.., ఆనాటి నుండి యాక్టర్ గా రాణించాలన్న కోరిక ఆయనలో ఉండేది. ఓ ప్రముఖ ఛానెల్ లో ఉద్యోగిగా పని చేస్తూనే.., ఆయన అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ.. ఆ ఛానెల్ వారు తమ దగ్గర జాబ్ చేస్తూ.., మరోవైపు యాక్టింగ్ అంటే కుదరదు అని కండీషన్ పెట్టారు. దీనితో తుమ్మల నరసింహ రెడ్డి ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేకాదు.., తన కలలకి, కళకి అడ్డంకిగా నిలిచే ఏ ఉద్యోగం చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల పాటు ఆయన ఏ జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. కానీ.. తన సినిమా ప్రయత్నాలని మాత్రం ఆపలేదు.

2) అప్పటికే టి.ఎన్.ఆర్ పూర్తిగా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయనకి “ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్” పోగ్రామ్ కి హోస్ట్ గా అవకాశం వచ్చింది. సినిమా సెలబ్రెటీలని దగ్గర నుండి కలుసుకుని, వారితో ర్యాపొ పెంచుకునే ఛాన్స్ ఉండటంతోనే టి.ఎన్.ఆర్ ఈ షోని పట్టాలెక్కించాడు. ఇక్కడే కెరీర్ లో ఆయన సగం సక్సెస్ అయిపోయాడు.

3) టి.ఎన్.ఆర్ ఇంటర్వూస్ ఆన్ ఎయిర్ అయ్యాక కూడా ఆయన సోషల్ మీడియాలో బిజీగానే ఉంటూ వచ్చారు. ముఖ్యంగా టి.ఎన్.ఆర్ కి ఫేస్ బుక్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక్కడ యువ టెక్నీషియన్స్ కి ఆయన మంచి సపోర్ట్ అందిస్తూ వచ్చారు. అదే సమయంలో సామాన్య ప్రేక్షకులకి కూడా ఓపిగ్గా అన్నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తూ తన రీచ్ పెంచుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

4) ఇక వ్యక్తిగతంగా టి.ఎన్.ఆర్ కి క్రేజ్ రావడంతో ఆయనకి సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. చివరి సంవత్సరం రోజులుగా ఆయన వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంటూ వచ్చారు. కానీ.., ఇక్కడే టి.ఎన్.ఆర్ తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ఎన్ని మూవీ ఆఫర్స్ వచ్చినా.., ఆయన మాత్రం తనకి పేరు తీసుకొచ్చిన ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్ పోగ్రామ్ ని ఆపలేదు. తన 200 ఇంటర్వ్యూని ఆయన మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేసుకుని ఉన్నారంటే.., పోగ్రామ్ విషయంలో ఆయన ఎంత కమిట్మెంట్ తో ఉండే వారో అర్ధం చేసుకోవచ్చు.

5) ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఫైనాన్షియల్ గా టి.ఎన్.ఆర్ చాలా క్రమశిక్షణతో ఉంటారు. కానీ.., చేతిలోకి సంపాదన వచ్చే సమయానికి ఆయనకి విపరీతమైన ఖర్చులు వచ్చి పడ్డాయి. అక్క కూతురు పెళ్లి కోసం ఆయన చాలా కార్చి చేశారు. అలాగే ఈ నెలలోనే తన అక్క గారు కోవిడ్ కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ హాస్పిటల్ బిల్ మొత్తం టి.ఎన్.ఆర్ చెల్లించారు. ఇన్నాళ్లు తాను సంపాదించుకున్న సొమ్మంతా అయిన వారి కోసం ఖర్చు పెట్టాడే గాని.., బాధ్యతల నుండి పక్కకి పోలేదు. ఈ నిర్ణయమే టి.ఎన్.ఆర్ చనిపోయాక కూడా ఆయన మీద మరింత గౌరవం పెంచేలా చేసింది.

సో ఇవన్నీ.. టి.ఎన్.ఆర్ తన జీవితంలో వివిధ దశల్లో తీసుకున్న కీలకమైన మంచి నిర్ణయాలు. ఇవే ఆయనకి మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి. ఏదేమైనా టి.ఎన్.ఆర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.