“థాంక్యూ బ్రదర్” సినిమా ఎక్స్ క్లూజివ్ రివ్యూ

ఫిల్మ్ డెస్క్– కరోనా నేపధ్యంలో సినిమా హాల్స్ క్లోజ్ అవ్వడంతో లో బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థాంక్యూ బ్రదర్ ఆహా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా– థాంక్యూ బ్రదర్
తారాగణం– అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, అర్చన అనంత్ తదితరులు
దర్శకత్వం– రమేష్ రాపర్తి
నిర్మాతలు– మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి
సంగీతం– గుణ బాలసుబ్రమణ్యం
విడుదల– 07-05-2021

కధ:
అభి (విరాజ్ అశ్విన్) ఫ్రెండ్స్, అమ్మాయిలతో బలాదూర్ తిరుగుతూ, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడు. అమ్మ మాటను పట్టించుకోకుండా తాగుడు, అమ్మాయిలే లోకంగా బతికేస్తుంటాడు. ఇటివంటి సమయంలో అనుకోకుండా అభిలో పెరిగిన కసి వల్ల ఇంటి నుండి బయటకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇదే క్రమంలో ప్రియ (అనసూయ భరద్వాజ్) ఓ ఆక్సిడెంట్ లో తన భర్తను కోల్పోతుంది. ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీగా ఉంటుంది. భర్త చనిపోవడంతో అత్తతో కలిసి ఉంటూ ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా అభి, ప్రియ ఓ అపార్ట్ మెంట్ లోని లిఫ్టులో ఇరుక్కుంటారు. ఆదే టైంలో ప్రియకు పురిటి నొప్పులు మొదలవుతాయి. ఆలాంటి క్లిష్ట సమయంలో అభి ఎలా రియాక్డ్ అయ్యాడు, ప్రియను అభి కాపాపాడా.. లిఫ్ట్ లో అసలేం జరిగిందన్నదే అసలైన కధ. ఏం చేశాడన్నదే సినిమా కథ.

ఎవరెలా చేశారంటే…
థాంక్యూ బ్రదర్ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన విరాజ్ అశ్విన్ గతంలో రెండు మూడు చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింరు రాలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం గుర్తుండిపోయే పాత్ర లభించిందనే చెప్పాలి. మరోవైపు ప్రియ పాత్రలో నటించిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అను ఏ పాత్రలో నటించినా అందులో లీనమైపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలోను అనసూయ అద్భుతంగా నటించింది. ప్రత్యేకంగా సెకండాఫ్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన సన్నివేశాల్లో అనసూయ చాలా నాచురల్ గా నటించింది. ఇంటర్వెల్ కు ముందు. ఆ తరువాత వచ్చే సన్నివేశాల్లో, లిఫ్ట్ లో ఆమెకు డెలివరీ అయ్యే సన్నివేశాల్లో అద్భుతంగా నటించిందని చెప్పకతప్పదు. ఇక అభి తల్లి పాత్రలో నటించిన కార్తీక దీపం ఫేం అర్చన, పెంపుడు తండ్రి పాత్రలో నటించిన అనిల్ కురువిల్లా, ప్రియ అత్త పాత్రలో నటించిన అన్నపూర్ణ, అభి స్నేహితుడిగా వైవా హర్ష వారి వారి పాత్రల పరిధుల మేరకు బాగానే నటించారు. ఇక ప్రియ భర్త పాత్రలో నటించిన ఆదర్శ్‌ది అంత ప్రాధాన్యం లేని క్యారెక్టర్ అని చెప్పవచ్చు.

సినిమా గురించి మరి కాస్త..
థాంక్యూ బ్రదర్ సినిమాను భావోద్వేగాలతో మంచి కధతో దర్శకుడు రమేష్ తీర్చి దిద్దారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే విధానం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. ఈ సినిమాకు సెకండ్ హాఫ్ చాలా కీలకం. మొదటి సగం మామూలుగానే సాగుతుంది. అంతే కాకుండా కధలో వచ్చే కీలక సన్నివేశాలను కాస్త సాగదీశారని చెప్పవచ్చు. సినిమాలో విరాజ్ అశ్విన్, అనసూయల నటనే ప్రధానం. కాస్త సంటిమెంట్, భావోద్వేగాలను లైక్ చేసే వాళ్లు థాంక్యూ బ్రదర్ సినిమాను చూడవచ్చు.