ఏ.ఆర్ రెహమాన్ కి మనసులోని మాట చెప్పిన గాయని సుశీలమ్మ!..

తన బయోపిక్ ను తెరకెక్కించాలంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ను లెజెండరీ సింగర్ పి.సుశీల కోరారు.   సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13 న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పి.ముకుందరావు, తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు జాతీయ పురస్కారాలు,  ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల తనదైన గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ- హిందీ- బెంగాలీ- ఒరియా- సంస్కృతం- తుళు- బడుగ- సింహళ భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. వివరాల్లోకి వెళ్తే, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ జంట‌గా న‌టించారు. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కినా కోవిడ్ వల్ల ప్రజలు థియేటర్లకు వెళ్లని పరిస్థితి ఎదురైంది. లెజెండరీ సింగర్ సుశీలా ఇటీవల ఈ చిత్రాన్ని చూశారు. అనంతరం ప్రశంసలు కురిపించారు.

82916884

తన బయోపిక్ చేయాలని లెజెండరీ గాయని రెహమాన్ ను ప్రేమపూర్వకంగా అభ్యర్థించారు. ఈ చిత్రానికి చెందిన తెలుగు, తమిళం, హిందీ వర్షన్లు జియో సినిమా, నెట్ ఫ్లిక్స్ లలో ప్రసారమవుతున్నాయి. ఇటీవలే తాను సుశీలమ్మతో మాట్లాడానని ’99 సాంగ్స్’ సినిమా చూశారా? అని అడిగానని తెలిపారు. సినిమాను చూడకపోతే నెట్ ఫ్లిక్స్ లో చూడాలని చెప్పానని… ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ సినిమా తెలుగు వర్షన్ ను ఆమెకు చూపించాలని కోరానని చెప్పారు. సినిమా చూసిన తర్వాత సుశీలమ్మ తనను పిలిపించుకున్నారని… చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారని తెలిపారు. ఈ సందర్భంగా ’99 సాంగ్స్’ మాదిరి తన బయోపిక్ కూడా తీయాలని ఆమె తనను కోరారని చెప్పారు. మరి సుశీలమ్మ కోరికను రెహ్మాన్ ఎప్పుడు నెరవేరుస్తారో వేచి చూడాలి.