మరోసారి మంచి మనసును చాటుకున్న హీరో సూర్య

suriya

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం జైభీమ్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. 1993 కాలంలో దళిత, ఆదివాసిలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి చిత్ర వధకు గురి చేసిన వాస్తవాలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సినిమాపై అటు సినిమా రంగానికి చెందిన వారే కాకుండా ఇతర రాంగాల వారు కూడా సినిమాను ప్రశంసిస్తున్నారు.

అయితే 1993 లో కస్టడీలో చంపబడిన భర్త రాజకన్నకు న్యాయం జరగాలంటూ భార్య పార్వతి అమ్మాళ్ చేసిన న్యాయపోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జ్ఞానవేల్. వాస్తవానికి రియల్ కథలో చంపబడిన భర్త రాజకన్న భార్య పార్వతి అమ్మళ్ కు కోర్టులో న్యాయం దక్కినా ఇప్పటికీ కూడా ఆమె ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. దీనిని గుర్తించిన హీరో సూర్య తన వంతు సాయంగా పార్వతికి రూ. 10 లక్షలు నగదును ఆమె పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి తన ధాతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.

దీనిపై వచ్చే నెల నెల వడ్డీ అంతా పార్వతికి వెళ్తుందని ఆ తర్వాత ఆమె పిల్లలకు అందజేస్తానని సూర్య తెలిపారు. ఇక సూర్యతో పాటు డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ కూడా పార్వతికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇక తాజాగా హీరో సూర్య చేసిన ఇంతటి సాయానికి నెటిజన్స్ అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు. సూర్య చేసిన భారీ సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.