సురేఖా వాణి హంగామా అంతా ఇంతా కాదు

ఫిల్మ్ డెస్క్- ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్త్ సురేఖా వాణి తెలుసు కదా.. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సంపాదించింది సురేఖ. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాలోను సురేఖా వాణికి బాగా యాక్టివ్ గా ఉంటుంది. సందర్బానుసారం ట్రెండ్ ను ఫాలో అవుతూ తన ముద్దుల కూతురు సుప్రితతో కలిసి హంగామా చేస్తుంది సురేఖ. అందుకే సురేఖ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ కు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ.. కూతురు సుప్రితతో దిగిన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది సురేఖా వాణి. ఇదిగో తాజాగా గత రాత్రి ఇంట్లో చేసిన ఎంజాయ్ మెంట్ కు సంబందించిన ఫొటోలు షేర్ చేసింది. నేడు అంటే ఏప్రిల్ 29న తన పుట్టినరోజు సందర్భంగా కూతురు సుప్రితతో పాటు, అత్యంత సన్నిహితులతో కలిసి పార్టీ చేసుకుంది సురేఖా వాణి. కూతురు సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ అదరగొట్టేసింది. అయితే ఈ వేడుకలో తనకెంతో ఇష్టమైన భర్త సురేష్ తేజను మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ఆయనపై తన ప్రేమను చాటుకుంది సురేఖా వాణి. అంతే కాదు తన బర్త్ డే ఏర్పాట్లన్నీ చేసి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు కూతురు సుప్రితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది సురేఖా వాణి. నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదంటూ కామెంట్ చేసింది. ఇంకేముంది సురేఖా వాణి బర్త్ డే సంబరాలకు సంబందించిన ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here