ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022 హంగమా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో అన్ని జట్లు మెగా పోటీకి సిద్ధం అవుతున్నాయి. టీమ్ ప్రమోషన్‌లో భాగంగా కొన్ని జట్లు వీడియోలను కూడా విడుదల చేస్తున్నాయి. కొన్ని వీడియోస్‌లో ఐపీఎల్ జట్ల ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు తమకు తెలిసిన ఆటే కాకుండా.. డాన్స్ చేయడం కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లేయర్లు కూడా ఒక వీడియో షూట్‌లో పాల్గొన్నారు. అందులో ఒక పాటకు స్టెప్పులు వేయాల్సి ఉంది.
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కొత్త మూవీ సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటకు క్రికెటర్లు డాన్స్ చేయాలి. అందులోని సిగ్నేచర్ స్టెప్‌ను వేసేందుకు ఆటగాళ్లు ఆపసోపాలు పడ్డారు. మహేష్‌బాబులా ఆ స్టెప్ వేయాలని తెగ ప్రయత్నించారు. ఆటగాళ్లు ఆ స్టెపు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను SRH తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే తమ అభిమాన హీరో మహేష్‌బాబును మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. మరి SRH ఆటగాళ్ల డాన్స్ కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SRH మరో విచిత్రమైన నిర్ణయం! ఫ్యాన్స్ ఫైర్!
The dance, you saw. 🕺
The making, you now see 😅#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/76RHAhDXQI
— SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.